Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Raghava Lawrence: రాజ్ మోహన్‌పై ట్రోల్స్.. విజయ్‌కు అండగా లారెన్స్

Telugu Bell 6 days ago

సీఎం విజయ్ తన క్యాబినెట్‌లో రాజ్ మోహన్ (Raj Mohan) ను ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రాఫ్ చట్టం (Movie Era & Cinematograph Act Minister) మంత్రిగా నియమించారు.

అయితే, చిత్ర పరిశ్రమపై అంతగా అవగాహన, సీనియారిటీ లేని వ్యక్తికి ఇంత కీలకమైన శాఖను ఎలా కేటాయిస్తారంటూ కోలీవుడ్ సినీ వర్గాల నుండి గట్టిగానే నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ వివాదం కాస్త ముదురుతున్న తరుణంలో రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అందరినీ శాంతపరిచే ప్రయత్నం చేశారు.

రాఘవ లారెన్స్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.. 'మన గౌరవనీయ ముఖ్యమంత్రి, నా ఆప్తమిత్రుడు సీఎం జోసెఫ్ విజయ్ గారు కచ్చితంగా ఎంతో జాగ్రత్తగా, భవిష్యత్తును ఆలోచించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఎవరూ కూడా ఆవేశంతో, తొందరపాటుతో సోషల్ మీడియాలో స్పందించకండి. కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజ్ మోహన్ గారు మన చిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం, సినీ కార్మికుల హక్కుల కోసం తన వంతు ఉత్తమ కృషి చేస్తారని నేను నమ్ముతున్నాను' అని తెలిపారు.

అయితే రీసెంట్ గానే సూపర్‌స్టార్ రజినీకాంత్ సైతం విజయ్ సాధించిన ఈ విజయం.. లెజెండ్స్ అయిన ఎంజీఆర్, ఎన్టీఆర్ ల రికార్డుల కంటే చాలా పెద్దదంటూ ఆకాశానికెత్తారు. ఇప్పుడు రాఘవ లారెన్స్ కూడా కోలీవుడ్ అంతర్గత విమర్శల నుండి విజయ్ క్యాబినెట్ నిర్ణయాలను సమర్థించడంతో.. చిత్ర పరిశ్రమ అంతా మెల్లమెల్లగా కొత్త సీఎం విజయ్ వైపు నడవడానికి సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. మరి విజయ్ తీసుకున్న ఈ సరికొత్త పొలిటికల్ స్టెప్స్, కొత్త మంత్రుల పాలన రాబోయే రోజుల్లో కోలీవుడ్ పరిశ్రమను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell