Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Rashmika Mandanna: కృతి హాట్‌నెస్‌పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్

Telugu Bell 6 days ago

ష్మిక మందన్నా, బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ హిందీ చిత్రం 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2).

ఆదివారం ముంబై వేదికగా ఈ సినిమాకు సంబంధించిన ఒక గ్రాండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో రష్మిక తన కో-స్టార్ కృతి సనన్‌ను విపరీతంగా పొగిడే క్రమంలో ఎవరూ ఊహించని విధంగా ఒక 'F-బాంబ్' (బూతు పదం) వాడేసింది. దీంతో అక్కడున్న మీడియా, ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఈవెంట్ స్టేజ్ పైన రష్మిక చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ పక్కనే ఉన్న కృతి సనన్‌ వైపు తిరిగి ప్రశంసల జల్లు కురిపిస్తూ..' 'కాక్‌టెయిల్ 2' లో ఏదో ఒక కొత్తదనం ఉంది. కృతి.. నువ్వు చాలా హాట్‌గా ఉన్నావు. ఆ విషయం ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు.. అండ్ యు ఆర్ ఫింగ్ హాట్ (You’re fuc*ing sizzling)!'.. అని అనేసింది. కానీ రష్మికకు మరుక్షణమే అర్థమైంది తాను ఎంత పెద్ద మాట అన్నాదో.. వెంటనే షాక్‌తో తన చేతులతో నోరు మూసుకుంది. ఆ తప్పును కవర్ చేయడానికి నవ్వుతూ.. 'ఓహ్ సారీ! దాన్ని సైలెన్స్ (సెన్సార్) చేసేయండి' అని హిలేరియస్‌గా కౌంటర్ ఇచ్చింది. రష్మిక రియాక్షన్‌కు అక్కడ ఉన్న ఆడియన్స్, మీడియా వాళ్లు గట్టిగా నవ్వుతూ కేకలు వేశారు. ఆ తర్వాత రష్మిక తేరుకుని.. 'ఆమె చాలా అమేజింగ్.. లుక్ ఎట్ హర్. మా మధ్య చాలా ఎక్కువ ప్రేమ నడుస్తోంది' అంటూ కృతిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది.

స్టేజ్ పైన ఉన్నవాళ్లు ఈ విషయాన్ని నవ్వుతూ లైట్ తీసుకున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం రష్మిక వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎంతో పద్ధతిగా, పద్ధతైన పదాలతో మాట్లాడే రష్మిక.. ఈసారి ముంబై కల్చర్‌కు అలవాటు పడి కాస్త ఓవర్‌బోర్డ్ (హద్దులు దాటి) ప్రవర్తించిందని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఫ్లోలో వచ్చే స్లిప్-ఆఫ్-దింగ్ (నోరు జారడం) అయినా.. పబ్లిక్ ఈవెంట్లలో ఇలాంటి పదాలు వాడటం రష్మిక క్లీన్ ఇమేజ్‌కు కాస్త మైనస్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell