Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!

Telugu Bell 4 days ago

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరో రెండు వారాల్లో మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేశాడు రామ్ చరణ్. ఇప్పటికే సుకుమార్ కాంబినేషన్‌లో #RC17 ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయగా, ప్రస్తుతం సుకుమార్ కథపై కసరత్తులు చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయినట్టు సమాచారం. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ లుక్ అండ్ స్టైల్ ఎలా ఉండాలనే దానిపై సుకుమార్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చరణ్‌తో కలిసి ముంబైలోని ఓ ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్‌ను సుకుమార్ సంప్రదించినట్లు టాక్. చరణ్‌పై ఒక ప్రత్యేక టెస్ట్ షూట్‌ను కూడా నిర్వహించారట.

ఆ అవుట్‌పుట్‌తో సుకుమార్ పూర్తిగా సంతృప్తి చెందారని, చరణ్ లుక్ & స్టైల్‌ను ఫైనలైజ్ చేశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ‘పెద్ది’ సినిమా విడుదలైన వెంటనే #RC17 సెట్స్ పైకి వెళ్లనుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ ఏడాది జూలైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసి, తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. కాబట్టి త్వరలోనే సరికొత్త అప్డేట్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ – సుకుమార్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. పైగా ‘పుష్ప 2’ లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తర్వాత సుకుమార్ తెరకెక్కించబోయే చిత్రం కావడంతో, అనౌన్స్మెంట్ నుంచే దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి ఈసారి రామ్ చరణ్‌తో కలిసి సుకుమార్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell