Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

RC 17 : సుకుమార్‌ - దేవీశ్రీ కాంబినేషన్‌కు బ్రేక్‌ పడుతోందా?

Telugu Bell 1 week ago

సుకుమార్‌-దేవీశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌కు బ్రేక్‌ పడుతోందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. 'ఆర్య' సినిమాతో మొదలైన వీరి ప్రయాణం నిన్నటి 'పుష్ప: ది రైజ్', నేటి 'పుష్ప 2: ది రూల్' వరకు అప్రతిహతంగా సాగింది.

లెక్కల మాస్టారి సక్సెస్‌లో సగం క్రెడిట్ దేవీశ్రీ మ్యూజిక్‌కే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటిది వీరిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయంటూ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

'పుష్ప 2' సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా రీ-రికార్డింగ్ విషయంలో దేవీశ్రీ ప్రసాద్ వ్యవహారశైలి వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని డెడ్‌లైన్ సమయానికి అవుట్‌పుట్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో సుకుమార్ ప్రత్యామ్నాయాలు వెతకాల్సి వచ్చిందని గుసగుసలు వినిపించాయి. దీంతో 'పుష్ప – 2'లోని కొన్ని కీలకమైన సీన్స్‌కు శ్యామ్, ఎస్‌.ఎస్‌ తమన్‌లతో రీ-రికార్డింగ్ చేయించారనే లీకులు ఇండస్ట్రీని షేక్ చేశాయి. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలోనూ దేవీశ్రీ కేవలం ఆడియో పాటలకే పరిమితమై, రీ-రికార్డింగ్ బాధ్యతలను తమన్‌కు అప్పగించారనే టాక్ ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చింది. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. సాధారణంగా సుకుమార్ సినిమా అంటే కళ్లు మూసుకుని దేవీశ్రీ ప్రసాద్ పేరే అనుకుంటారు. కానీ, 'పుష్ప 2' పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో వేరే మ్యూజిక్ డైరెక్టర్‌ను సుకుమార్ లైన్‌లో పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన శాశ్వత్ సచ్‌దేవ్ లేదా ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ పేర్లు ఈ ప్రాజెక్ట్ కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ కాంబినేషన్ బ్రేకప్ గురించి కానీ రామ్ చరణ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మార్పుపై కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 20 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉన్న ఈ హిట్ కాంబో కేవలం తాత్కాలిక సమస్యల వల్ల విడిపోతుందా లేక రాబోయే ప్రాజెక్టులతో మళ్లీ కలిసి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell