Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..?

రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..?

Telugu Bell 1 week ago

హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న రా అండ్ వయొలెంట్ విలేజ్ డ్రామా 'భోగి'. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని మొదట ఆగస్టు 28న విడుదల చేయాలని భావించినప్పటికీ, ఆగస్టు 26న యష్ 'టాక్సిక్' గ్రాండ్ రిలీజ్ ఉండటంతో సోలో రిలీజ్ కోసం మేకర్స్ వాయిదా వేసే యోచనలో ఉన్నారు.

అయితే సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు సినిమాల పోటీ ఎక్కువగా ఉండటంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సరైన డేట్ వెతకడం మేకర్స్‌కు పెద్ద సవాలుగా మారింది.

మరోవైపు శర్వానంద్ – శ్రీను వైట్ల ఎంటర్‌టైనర్‌ను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ‘భోగి’ విడుదల మరింత ఆలస్యమైతే రెండు సినిమాల మధ్య గ్యాప్ తగ్గిపోవడమే కాకుండా, శర్వా తన లుక్ మార్చుకుని కొత్త సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి సమయం సరిపోదు. మరి ఈ ప్లానింగ్ సమస్యల నడుమ ‘భోగి’ని సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లోనే తీసుకువస్తారా లేక సంక్రాంతి రేస్‌లోకి మారుస్తారా అనేది త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

The put up రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell