రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'రౌడీ జనార్దన' ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాకు మొదట క్రిస్టో జేవియర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికవ్వగా, ఇప్పుడు ఆయనతో పాటు 'టాక్సిక్' ఫేమ్ విశాల్ మిశ్రా కూడా టీమ్‌లోకి చేరాడు. విశాల్ మిశ్రా పాటలకు మ్యూజిక్ సమకూర్చనుండగా క్రిస్టో జేవియర్ బీజీఎం పై వర్క్ చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ఆల్బమ్ ప్రేక్షకులకు ఒక సరికొత్త మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని చిత్రబృందం నమ్ముతోంది.
ఇంటెన్స్ రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్లో భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
The put up 'రౌడీ జనార్థన' కోసం మరో టెక్నీషియన్.. ఎవరంటే..? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
