Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'సమవర్తి'గా మారిన సత్యదేవ్.. ఇంట్రెస్టింగ్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్..!

Telugu Bell 2 days ago

వైవిధ్యభరితమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ తన నెక్స్ట్ మూవీకి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు.

ఆయన త్వరలోనే 'సమవర్తి' అనే పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రానున్నాడు. అజయ్ నాగ్ వి. దర్శకత్వంలో రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పర్యావరణ నేపథ్యంతో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయి.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సత్యదేవ్ సరికొత్త రౌద్ర రూపం హైలైట్‌గా నిలిచింది. తన చుట్టూ సాయుధులు దాడికి వస్తున్నా, ఆయన ఎంతో ప్రశాంతంగా, ధీమాగా కనిపించడం పాత్రలోని తీవ్రతను తెలియజేస్తోంది. “సమవర్తి” అంటే పక్షపాతం లేని తీర్పునిచ్చే యముడు అని అర్థం. దుష్టశక్తులను అంతమొందించే ఒక క్రూరమైన శిక్షకుడి పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడని ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది.

ఈ సినిమాలో దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గానవి లక్ష్మణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం, ఫస్ట్ లుక్‌తోనే అందరినీ ఆకట్టుకుని సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.

The publish 'సమవర్తి'గా మారిన సత్యదేవ్.. ఇంట్రెస్టింగ్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell