Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సెన్సార్ పనులు ముగించుకున్న 'పెద్ది'.. రన్‌టైమ్ ఎంతంటే..?

Telugu Bell 4 days ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'పెద్ది' ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం నుంచి రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంటూనే, ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. పెద్ది చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఇక ఈ చిత్ర రన్‌టైమ్‌ను 3 గంటలుగా లాక్ చేశారట మేకర్స్.

ఇలాంటి లాంగ్ రన్‌టైమ్‌తో సినిమా వస్తోందంటే, దర్శకుడు కథను ఎక్కడా రాజీ పడకుండా బలమైన ఎమోషన్స్ మరియు భారీ యాక్షన్ సీన్లతో చాలా పకడ్బందీగా తెరకెక్కించారని స్పష్టమవుతోంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా జూన్ 4న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

The submit సెన్సార్ పనులు ముగించుకున్న 'పెద్ది'.. రన్‌టైమ్ ఎంతంటే..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell