సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ, నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'.
అజయ్ భూపతి దర్శకత్వంలో తిరుపతి నేపథ్యంలో సాగే ఈ పల్లెటూరి ప్రేమకథా చిత్రం షూటింగ్ పూర్తయింది.
తాజాగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో కే.రాఘవేంద్రరావు, సి.అశ్విని దత్ వంటి ప్రముఖుల సమక్షంలో ఈ నూతన జంటను 'శ్రీను, మంగ' పాత్రలుగా ప్రేక్షకులకు పరిచయం చేశారు. హైదరాబాద్, తిరుపతి, బళ్లారి, మధ్యప్రదేశ్ పరిసరాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ ఇద్దరు యంగ్ యాక్టర్స్‌కు ఇది ఒక పర్‌ఫెక్ట్ డెబ్యూ అవుతుందని దర్శకుడు అజయ్ భూపతి ధీమా వ్యక్తం చేశాడు. జెమిని కిరణ్, సి.అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈ ఏడాది జూలైలో విడుదల కానుంది.
The put up శ్రీనివాస మంగాపురం : గ్రాండ్‌గా 'శ్రీను-మంగ'ల పరిచయం..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
