ప్రముఖ తమిళ నటుడు జయం రవి (రవి మోహన్) తన వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ఒడిదుడుకులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఎంతో సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తినని, ఎవరైనా ఏదైనా చెబితే అర్థం చేసుకుని, అవసరమైతే రాజీపడే తత్వం తనదని ఆయన పేర్కొన్నాడు.
అయితే, ప్రస్తుతం తన వైవాహిక జీవితంలో నడుస్తున్న విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు తాను సినిమాల్లో నటించబోనని స్పష్టం చేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చారు.
ఈ నిర్ణయం వెనుక ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని, దీనికి సినీ పరిశ్రమతో గానీ, ఇతర హీరోలతో గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశాడు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని జయం రవి వివరించాడు. గత 23 ఏళ్లుగా అహర్నిశలు శ్రమిస్తూ, పరిశ్రమకు తన వంతు సహకారాన్ని అందించానని, తాను నటించిన చిత్రాలలో 95 శాతం సినిమాలు ఘనవిజయం సాధించాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నాడు.
ఇంతటి సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతో కష్టపడినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు తనను కొంత అవమానానికి గురిచేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తనను అవమానిస్తున్న వారి ముందు ఈ విషయాలను బహిరంగంగా ప్రస్తావించడంలో ఎలాంటి తప్పు లేదని జయం రవి అన్నాడు. ఆయన తీసుకున్న ఈ తాత్కాలిక విరామ నిర్ణయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
The put up సినిమాలకు దూరంగా హీరో జయం రవి.. అసలు కారణం ఇదే..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
