Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Sonakshi Sinha & Jyotika's Gadget OTT Film Assessment In Telugu

Telugu Bell 2 days ago

ఓటీటీ స్ట్రీమింగ్ తేది : మే 22, 2026
ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

టీనటులు: జ్యోతిక, సోనాక్షి సిన్హా, అశుతోష్ గౌరీకర్, విజయంత్ కోహ్లీ, ఫ్రెయా కొఠారి, ప్రీతి అగర్వాల్, సందీప్ సేన్ గుప్తా తదితరులు

దర్శకత్వం: అశ్విని అయ్యర్ తివారి
నిర్మాతలు : పమ్మి బవేజా, హర్మాన్ బవేజా, స్మిత బలిగా
సంగీతం: కార్తీక్ మాణికవసం, ఓఫ్ & సవేరా, అనా రెహ్మాన్
ఛాయాగ్రహణం: రంగరాజన్ రామభద్రన్
కూర్పు: చారు శ్రీ రాయ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ కంటెంట్ లో జ్యోతిక, సోనాక్షి సిన్హాల కలయికలో ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం 'సిస్టం' కూడా ఒకటి. మరి తెలుగు డబ్బింగ్ లో కూడా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:

ఢిల్లీ హైకోర్ట్ లో పేరు మోసిన లాయర్ రవి రాజ్ వంశ్ (అశుతోష్ గౌరీకర్) ఒక్క కేసు కూడా ఓడిపోయింది లేదు. అలాగే తన కూతురు నేహా రాజ్ వంశ్(సోనాక్షి) కూడా అదే కోర్ట్ లో లాయర్ గా పని చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అదే కోర్ట్ లో స్టెనోగ్రాఫర్ గా పని చేసే సారిక రావత్ (జ్యోతిక) కి నేహాకి కొన్ని కేసుల విషయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారుతుంది. ఈ క్రమంలో నేహా వద్దకి ఓ పాపులర్ బిజినెస్ మెన్ విక్రమ్ బజ్రల్ (విజయంత్ కోహ్లీ) ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇనాయ కొఠారి(ఫ్రెయా కొఠారి) హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసుని రవి రాజ్ టేకప్ చేస్తే అతనికి వ్యతిరేకంగా తన కూతురు నేహా వాదిస్తుంది. అయితే అసలు ఈ కేసు వెనుక ఉన్న అసలు కారకులు ఎవరు? నిజంగానే విక్రమ్ బజ్రల్ ఇనాయ కొఠారిని హత్య చేసారా? ఆమెని ఎవరు ఎందుకు చంపారు? ఈ సిస్టంలో లొసుగులు అడ్డుపెట్టుకునే కొందరు లాయర్లు వల్ల నష్టపోయింది ఎవరు? లాభపడుతుంది ఎవరు? చివరికి కేసు ఎవరు గెలిచారు అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రం స్టార్టింగ్ లోనే ఒక హిట్టింగ్ లైన్ తో కథనం మొదలవుతుంది. కోర్ట్ లో కేవలం ఒకరి మీద నేరం నిరూపణ జరిగితే చాలు వారు ఆ నేరం చేసారా లేదా అనేది అనవసరం కానీ నిరూపణ జరిగితే చాలు వారు దోషిగా పరిగణించబడతారు అనే పాయింట్ తో మొదలైన కథనం డీసెంట్ గా హ్యాండిల్ చేయబడింది అని చెప్పవచ్చు.

ఈ పాయింట్ తోనే స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ లో ఇచ్చిన ముగింపు ఆడియెన్స్ ని సాటిస్ఫై చేస్తుంది. ఈ క్రమంలో నడిచే కోర్ట్ డ్రామా అలాగే ఇందులో మెయిన్ మోటివ్ దీని వెనుక ఉన్న రివెంజ్ ప్లాట్ లు అంతా చాలా డీసెంట్ గా ప్లాన్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేయబడ్డాయని చెప్పవచ్చు. ఇక వీటితో పాటుగా నటులు సోనాక్షి సిన్హా, జ్యోతికలు తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సెట్టయ్యారు.

అంతే రీతిలో సాలిడ్ పెర్ఫామెన్స్ లు అందించారు. అలానే జ్యోతిక బ్యాక్ స్టోరీ, అందులో రివెంజ్, ఎమోషనల్ అంశాలు బాగున్నాయి. ఇక సోనాక్షి సిన్హా, తన తండ్రితో కోర్ట్ రూమ్ ఆర్గుమెంట్ సీన్స్ ఇందులో బాగున్నాయి. అలానే కథనం అలా వెళుతున్న కొద్దీ కొత్త కొత్త కోణాలతో ఇంట్రెస్టింగ్ గా వెళ్లడం మరో ప్లస్ అని చెప్పొచ్చు. ఇక మెయిన్ లీడ్ తో పాటుగా ఇతర నటీనటులు అంతా కూడా సినిమాలో బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

ఇందులో ప్లాట్ లైన్ మన తెలుగు ఆడియెన్స్ కి అల్లరి నరేశ్ 'నాంది' సినిమాని గుర్తు చేయక మానదు. ఆ సినిమా చూసినవారికి ఇది అంత కొత్తగా ఏమీ అనిపించకవచ్చు కానీ దీనికి దగ్గర లైన్ తీసుకొని మరో కోర్ట్ డ్రామాని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.

అలాగే ఇందులో మరింత బలమైన ఆర్గుమెంట్ సీన్స్ ని డిజైన్ చేసుకొని ఉంటే ఇంపాక్ట్ మరింత ఎక్కువ ఉండేది. సో కొంతమేర సన్నివేశాలు అన్నీ చాలా సింపుల్ గానే ఉంటాయి. అంతే కాకుండా ఫస్టాఫ్ లో కథనం కొంచెం స్లోగా వెళ్లినట్టు అనిపిస్తుంది. నిజానికి సెకండాఫ్ లో కథనానికి ఇది ఎస్టాబ్లిష్మెంట్ కానీ మొదటి నుంచీ కథనం మరింత రసవత్తరంగా సాగి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా నాచురల్ సెటప్ తో ఒక కోర్ట్ రూమ్ డ్రామాకి కావాల్సిన విధంగా తెరకెక్కించి ప్రెజెంట్ చేశారు. అలాగే కెమెరా వర్క్, సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్ కూడా డీసెంట్ అని చెప్పొచ్చు. అలాగే తెలుగు డబ్బింగ్ వర్క్ కూడా బాగుంది.

ఇక అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వం విషయానికి వస్తే.. ఈ సినిమాలో తన వర్క్ బాగుంది. అనుకున్న పాయింట్ ని కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడా పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఎంగేజింగ్ కోర్ట్ రూమ్ డ్రామాని తాను తెరకెక్కించారు. అలాగే హర్మాన్ బవేజా, అరుణ్ కుమార్ ల కథ, కథనాలు ఇందులో బాగున్నాయి. అయితే ఇంకా బలమైన వాగ్వాదాలు, సీన్స్ లాంటివి కూడా జత చేసి ఉంటే ఈ కోర్ట్ డ్రామా మరింత ఇంపాక్ట్ చూపించేది. ఓవరాల్ గా వీరి వర్క్ బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ 'సిస్టం' అనే కొత్త చిత్రం ఒక డీసెంట్ రివెంజ్, కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పొచ్చు. చట్టంలోని లొసుగులు, మెయిన్ గా న్యాయ వ్యవస్థలో నేర నిరూపణ, బలమైన వారికి చట్టం ఎలా పని చేస్తుంది, బలహీనుల పట్ల ఎలా ఉంది అనే తారతమ్యాన్ని దర్శకులు డీసెంట్ కథనంతో నడిపించడం ఇందులో బాగుంది. తమ పాత్రల్లో సోనాక్షి, జ్యోతికలు పూర్తి న్యాయం చేశారు. ఇంకా కొన్ని సన్నివేశాలు మరింత బలంగా ఉండుంటే బాగుండేది కానీ ఒక డీసెంట్ కోర్ట్ రూమ్ డ్రామా చూడాలి అనుకుంటే ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో తప్పకుండా చూడొచ్చు.

123telugu.com Score: 3/5

Reviewed by means of 123telugu Workforce

The put up ఓటిటి సమీక్ష: 'సిస్టం' - తెలుగు డబ్ కోర్ట్ రూమ్ రివెంజ్ డ్రామా ప్రైమ్ వీడియోలో first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell