Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!

Telugu Bell 1 week ago

ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించిన రెండు మూడు ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఫౌజీ, కల్కి2 షూటింగ్‌తో పాటు స్పిరిట్ కూడా షూటింగ్ స్టేజీలో ఉంది.

ఈ సినిమాల షూటింగ్‌ను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తు వస్తున్నాడు ప్రభాస్. అయితే, ‘స్పిరిట్’ విషయంలో మాత్రం డార్లింగ్ రూట్ మార్చాడు. ప్రస్తుతానికి మిగిలిన సినిమాలను పక్కనపెట్టి, కేవలం స్పిరిట్ కోసమే 60 రోజుల భారీ నాన్-స్టాప్ షెడ్యూల్‌ స్టార్ట్ చేశాడు. బాహుబలి తర్వాత చాలా ఏళ్లకు ప్రభాస్ ఒకే ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం విశేషం. సందీప్ వంగా మార్క్ ఇంటెన్సిటీని మ్యాచ్ చేసేందుకు డార్లింగ్ గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.

హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో భాగంగా నాలుగు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కథకు కీలకమైన ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా ఒక ‘రా’ అండ్ ఇంటెన్స్ కలిగిన IPS ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర కోసం ప్రభాస్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ఇప్పటికే ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్న ఆయన, పక్కా ప్లానింగ్‌తో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సందీప్ మేకింగ్ స్టైల్‌కి తగ్గట్టుగా ఈ సినిమా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ పూర్తి చేసి, అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell