Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Sridevi: 'కోర్ట్' హీరోయిన్‌కు జాక్‌పాట్..రజినీకాంత్ మూవీలో శ్రీదేవి..?

Telugu Bell 4 days ago

న్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకునే ఒక సాధారణ అమ్మాయి.. నేడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేసే రేంజ్‌కు ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు.

సోషల్ మీడియా స్టార్ శ్రీదేవి (Sridevi) కెరీర్ గ్రాఫ్ ప్రస్తుతం చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్‌లో వచ్చిన 'కోర్ట్' (Court docket) సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత 'బ్యాండ్ మేళం' (Band Melam) చిత్రంతో బ్యాక్-టు-బ్యాక్ హిట్లు కొట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా ఇండియన్ చలనచిత్ర పరిశ్రమ సార్వభౌముడు, సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) సినిమాలో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రొడక్షన్ బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్’ (RKFI) లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో శ్రీదేవి ఒక అత్యంత కీలకమైన హీరోయిన్ పాత్రకు ఎంపికైనట్లు టాక్. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా శ్రీదేవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో హింట్ ఇచ్చింది.

1991లో మణిరత్నం దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ఆల్-టైమ్ క్లాసిక్ చిత్రం 'దళపతి' (Thalapathi) లోని ఒక ఐకానిక్ స్టైలిష్ పోజును ఇమిటేట్ చేస్తూ శ్రీదేవి ఒక ఫొటో దిగింది. దాన్ని తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయడంతో.. నెటిజన్లు.. సినీ విశ్లేషకులు “సూపర్ స్టార్-కమల్ హాసన్ ప్రాజెక్ట్‌లో శ్రీదేవి ల్యాండ్ అయిపోయింది.. అందుకే ఈ దళపతి హింట్” అంటూ డీకోడ్ చేస్తున్నారు. సాధారణంగా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్‌కైనా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో చిన్న క్యారెక్టర్ దొరికినా చాలు అనుకుంటారు. అలాంటి గోల్డెన్ ఛాన్స్ శ్రీదేవికి తన మూడో సినిమాకే రావడం ఒక అరుదైన రికార్డు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell