Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srikanth's Objection My Lord OTT Internet Collection Evaluate In Telugu

Srikanth's Objection My Lord OTT Internet Collection Evaluate In Telugu

Telugu Bell 2 weeks ago

ఓటీటీ వేదిక : జీ5
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జూలై 31, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

టీనటులు : శ్రీకాంత్, ముఖేష్ రిషి, అనన్య, స్నేహల్, సమీర్ తదితరులు

దర్శకులు : సంతోష్ అయ్యప్పన్
నిర్మాతలు : రాజ్ కుమార్ ఆకెళ్ల
సంగీతం : అరుణ్ చిల్వేరు
ఛాయాగ్రహణం : సూర్య
కూర్పు : కిషోర్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

శ్రీకాంత్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన తెలుగు వెబ్ సిరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్'. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

నారాయణ (రాయల హరిశ్చంద్ర) తన కూతురు సమీర కిడ్నాప్‌కు గురైందని పోలీసులకు రిపోర్ట్ చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ, ఆయనను ఎవరూ పట్టించుకోరు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయిస్తాడు. అక్కడ కూడా ఆయన కేసును ఏ లాయర్ టేకప్ చేసేందుకు ముందుకు రారు. దీంతో మనస్థాపానికి గురై కోర్టు ఆవరణలో ఆత్మహత్య చేసుకుంటాడు నారాయణ. ఈ ఘటనతో చలించిపోయిన అడ్వొకేట్ పరశురామ్(శ్రీకాంత్) కోర్టులో పిల్ దాఖలు చేస్తాడు. సమీర కేసును తాను టేకప్ చేస్తాడు. మరి ఈ కేసును పరశురామ్ గెలిచాడా..? ఆమె బతికే ఉందా..? పోలీసులు ఈ కేసును ఎందుకు ఫైల్ చేయలేదు..? ఈ కేసులో పరశురామ్ ఎలాంటి ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నాడు..? అనేది ఈ సిరీస్ కథ.

ప్లస్ పాయింట్స్ :

'అబ్జెక్షన్ మై లార్డ్' వెబ్ సిరీస్‌ను మేకర్స్ నిజాయితీగా రూపొందించారు. ఒక కిడ్నాప్ కేసుగా మొదలై ఆ తర్వాత వేరొక అంశం చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ ఓ చక్కటి సోషల్ మెసేజ్ కూడా అందిస్తుంది. కథనం చాలా చక్కగా సాగడంతో పాటు కొన్ని సర్‌ప్రైజ్ అంశాలు ఈ సిరీస్‌కు ప్లస్ అయ్యాయి.

శ్రీకాంత్, ముఖేష్ రిషి మధ్య సాగే కోర్టు సీన్స్ కథను ముందుకు తీసుకెళ్లడంలో చాలా ఉపయోగపడ్డాయి. ఈ సీన్స్ చూడటానికి సింపుల్‌గా ఉన్నా, ఆకట్టుకునేలా తెరకెక్కించారు.

ఈ సిరీస్‌ను శ్రీకాంత్ తన భుజాలపై మోశాడు. సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ఆయన మరోసారి ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. ఒక ఇన్సిడెంట్ ఆయన కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీయడంతో కోర్టులో ఆయన్ను అందరూ తక్కువచేసి చూస్తుంటారు. శ్రీకాంత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

శ్రీకాంత్ అసిస్టెంట్‌గా అనన్య శర్మ సాలిడ్ సపోర్ట్ ఇచ్చింది. ఆమె ఎంట్రీ తర్వాత హీరోలో కాన్ఫిడెన్స్ రావడంతో కథ మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ వారి పాత్రల్లో ఒదిగిపోయారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సిరీస్‌లోని చివరి ఎపిసోడ్‌ను ఇంకా బెటర్‌గా ఎగ్జిక్యూట్ చేయాల్సింది. సిరీస్‌కు ఈ ఎపిసోడ్ కీలకంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గించేస్తుంది. సిరీస్‌లో ఒక ముఖ్యమైన విషయాన్ని రివీల్ చేసిన తీరు కూడా పర్ఫెక్ట్‌గా లేదు. ఇంకా ముందే ఆ విషయాన్ని రివీల్ చేసి ఉంటే సిరీస్‌పై మరింత ఇంపాక్ట్ ఉండేది. కొన్ని చోట్ల డైలాగ్ డెలివరీ కూడా సరిగా లేదు.

శ్రీకాంత్ కుటుంబానికి సంబంధించిన సీన్స్ ఆకట్టుకోలేకపోయాయి. శ్రీకాంత్‌కు తన కొడుకుతో ఉన్న సీన్స్ ఇంకా బెటర్‌గా చూపెట్టాల్సింది. దీంతో ఈ సిరీస్‌కు ఫ్యామిలీ సీన్స్ పెద్దగా ఉపయోగపడలేదు.

సాంకేతిక వర్గం :

సంతోష్ అయ్యప్పన్ డైరెక్షన్ డీసెంట్‌గా ఉంది. కోర్డ్ రూమ్ థ్రిల్లర్ సిరీస్‌కు కావాల్సిన అన్ని విషయాల్లో ఆయన జాగ్రత్త పడ్డారు. సూర్య సినిమాటోగ్రఫర్‌గా మరియు షో రన్నర్‌గా తన పనితనం చూపెట్టారు. అరుణ్ చిల్వేరు సంగీతం బాగుంది. సాయి కిషోర్ ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా చూసుకుంటే.. 'అబ్జెక్షన్ మై లార్డ్' కోర్ట్ రూమ్ డ్రామాతో పాటు సోషల్ మెసేజ్ ఉన్న డీసెంట్ వెబ్ సిరీస్‌. కథలో కొత్తదనం లేకపోయినా సాలిడ్ పర్ఫార్మెన్స్‌లు, ఆకట్టుకునే రన్‌టైమ్‌తో ఈ సిరీస్ మెప్పిస్తుంది. శ్రీకాంత్ నటన, కథలో కొన్ని సర్‌ప్రైజ్‌లు ఎంగేజింగ్‌గా సాగుతాయి. క్లైమాక్స్ కాస్త తడబడినట్లుగా ఉండటం, హీరో ఫ్యామిలీ ట్రాక్ ఈ సిరీస్‌కు మైనస్. కోర్ట్ రూమ్ డ్రామాలను ఇష్టపడేవారు 'అబ్జెక్షన్ మై లార్డ్' సిరీస్‌ను ఓసారి ట్రై చేయవచ్చు.

123telugu.com Score: 3/5

Reviewed through 123telugu Crew

Click on Right here For English Evaluate

The submit ఓటీటీ సమీక్ష : అబ్జెక్షన్ మై లార్డ్ - జీ5లో తెలుగు వెబ్ సిరీస్ first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell