Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Suriya's Veerabhadrudu Film Assessment In Telugu | Trisha

Telugu Bell 1 week ago

విడుదల తేదీ : మే 15, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

టీనటులు : సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు
దర్శకుడు : ఆర్జే బాలాజీ

నిర్మాతలు : ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు
సంగీతం : సాయి అభ్యంకర్
ఛాయాగ్రహణం : జి.కె. విష్ణు
కూర్పు : ఆర్. కలైవానన్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే “వీర భద్రుడు”. నిన్ననే థియేటర్స్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు (ఇంద్రన్స్), తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగు పెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ, తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రీకూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) అనే ఒక అవినీతి లాయర్‌ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీర భద్రుడు (సూర్య) రంగం లోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీర భద్రుడు ఎవరు? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఒక సాలిడ్ అవుట్ కమ్ ఈ ‘వీర భద్రుడు’ అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్ లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ ల ఇంపాక్ట్ ని మరింతగా ఎలివేట్ చేసింది.

ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్ లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్ లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్ తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు క్లైమాక్స్ లో పెర్ఫామెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు, ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది.

ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్‌లు మాస్ ఆడియన్స్ కు ఒక ట్రీట్ లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్ తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. పోస్ట్-ఇంటర్వెల్ లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్‌రూమ్ సీక్వెన్స్, విజయ్ ‘లియో’ రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌ ని మరింత పెంచాయి.. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా తాలూకా ఎమోషనల్ డెప్త్, బేసిక్ స్టోరీలైన్ పరంగా చూస్తే, ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదు, పైగా కరప్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే శంకర్ మరియు అట్లీ సినిమాలను గుర్తుచేస్తుంది. అయితే, ఆర్జే బాలాజీ తన నేరేషన్ లో ఎంటర్టైనింగ్ థియేట్రికల్ మూమెంట్స్ ను యాడ్ చేశాడు కాబట్టి, కొన్ని లాజిక్స్ ను పక్కన పెడితేనే సినిమాను ఎంజాయ్ చేయగలం.

సినిమా స్టార్టింగ్ పోర్షన్స్ కాస్త స్లోగా సాగుతాయి, సూర్య ఎంట్రీ ఇంకాస్త ముందుగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. ఈ సినిమాకు ఉన్న మరో ప్రధానమైన డ్రా బ్యాక్ సూర్య డబ్బింగ్. ఇది ఆశించిన ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ఈ కీలకమైన అంశంపై మేకర్స్ మరింత శ్రద్ధ వహించాల్సింది.

అలానే ఇందులో రెండు ప్రధాన పాత్రలు తమిళనాడుకు చెందినవారు కావడంతో, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు తమిళంలో మాట్లాడుకుంటారు. ఇది న్యాచురాలిటీ కోసం పెట్టినప్పటికీ, తెలుగు ఆడియెన్స్ లో వెంటనే కనెక్ట్ కాకపోవచ్చు.

సాంకేతిక విభాగం:

సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. ట్రైలర్ లోనే సాలిడ్ విజువల్స్ ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మైంటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కవుట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది, కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్-నాచ్ లో ఉంది, అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్‌కు పర్ఫెక్ట్ గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ, దేవుని పవర్స్ కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్‌గా ప్రెజెంట్ చేశాడు, కానీ రైటింగ్ పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే, సూర్య ‘వీర భద్రుడు’ కొన్ని మంచి మూమెంట్స్ తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్సవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్ళీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ, బేసిక్ స్టోరీలైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్‌గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, పైగా సాంగ్స్ తమిళ వెర్షన్ లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్ గా, ఈ వీకెండ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది.

123telugu.com Score: 2.75/5

Reviewed by means of 123telugu Workforce

Click on Right here For English Assessment

The publish సమీక్ష : వీరభద్రుడు - మాస్ ఆడియన్స్‌కు మాత్రమే! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell