కోలీవుడ్ స్టార్ నటుడు అలాగే మన తెలుగులో మంచి ఆదరణ ఉన్న నటుడు సూర్య హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు ఆర్ జే బాలాజీ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రమే 'వీర భద్రుడు'.
తమిళ్ లో ‘కరుప్పు’ గా వచ్చిన ఈ సినిమా రెండు భాషల్లో కూడా ఈ వీకెండ్ కి ఇరగదీస్తోంది.
అయితే ఈ సినిమా ఈ మూడు రోజుల్లో భారీ బుకింగ్స్ ఇంకా వసూళ్లు రాబట్టగా ఇప్పుడు అసలు టెస్ట్ తో సినిమా ఫలితం అలానే సూర్య కంబ్యాక్ పై ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పవచ్చు. కంటెంట్ పరంగా వీర భద్రుడు సూర్యుకి కంబ్యాక్ సినిమానే కానీ బాక్సాఫీస్ పరంగా తేలాలి అంటే ఈ వర్కింగ్ డే సోమవారం టెస్ట్ కూడా పాస్ కావాల్సి ఉంది.
సో అటు తమిళ్, ఇటు తెలుగులో కూడా ఈ సినిమా సోమవారం వసూళ్లు, బుకింగ్స్ స్టడీ మైంటైన్ చేసింది అంటే ఈ డ్రై సీజన్ లో సూర్య సినిమాని ఆపడం కష్టమే అని చెప్పాలి. అలానే సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో ఆడియెన్స్ ఎలాంటి తీర్పు ఈ సినిమాకి అందిస్తారో చూడాలి.
The put up సూర్య కంబ్యాక్ కి అసలు టెస్ట్.. ఇది పాసైతే ఆపడం కష్టమే! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
