Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'టాక్సిక్‌' రిలీజ్ పై యశ్ క్రేజీ కామెంట్స్ !

Telugu Bell 6 days ago

శ్‌ హీరోగా తెరకెక్కుతున్న 'టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ - అప్స్‌' సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఈ సినిమా రిలీజ్ గురించి తాజాగా యశ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

'ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో విడుదల కాబోతుంది. మేం అన్ని ప్రాంతాలను దృష్టిలోపెట్టుకుని విడుదలను ప్లాన్‌ చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం మేము తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు, సాధారణంగా మన దేశంలో సినిమా విడుదల పద్ధతులకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అందుకే, 'టాక్సిక్‌' విషయంలో మేము హాలీవుడ్ విధానాన్ని అనుసరిస్తున్నాం’ అని యశ్ మాట్లాడారు.

యశ్ మాట్లాడుతూ.. ‘మొదట సినిమాను మొత్తం పూర్తి చేసి, ఆ తర్వాతే డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకుంటాం. ప్రస్తుతం నేను సినిమా విడుదల ప్రణాళికల పనుల్లోనే ఉన్నాను. ఈ పద్ధతి కచ్చితంగా అభిమానులకు నచ్చకపోవచ్చు' అని తెలిపారు. గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హ్యుమా ఖురేషీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకట్‌ కె.నారాయణ, యశ్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

The put up 'టాక్సిక్‌' రిలీజ్ పై యశ్ క్రేజీ కామెంట్స్ ! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell