గత కొన్ని వారాలుగా తెలుగు సినిమా బాక్సాఫీస్ వెలవెలబోతోంది. ఐపీఎల్, ఎండల తీవ్రత వల్ల పెద్ద సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ మధ్యలో వచ్చిన చిన్న చిత్రాలు కనీస డిజిటల్ ఖర్చులను కూడా రాబట్టలేకపోయాయి.
మే నెలలో కూడా చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేవీ విడుదలకు లేవు.
ఇలాంటి డ్రై సీజన్‌లో సూర్య నటించిన 'కరుప్పు' చిత్రం తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో నిన్న(మే 15) విడుదలైంది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, పోటీలో వేరే సినిమాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించింది. టాక్ బాలేకున్నా ఈ వీకెండ్‌లో మంచి వసూళ్లు రాబట్టేలా ఉంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తుండటంతో టాలీవుడ్ నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో మాత్రం ఈ సినిమా చాలా స్ట్రాంగ్‌గా దూసుకుపోతుండటం సూర్యకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది.
The publish టాలీవుడ్‌కు బూస్ట్ ఇచ్చిన సూర్య 'వీరభద్రుడు'..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
