Dailyhunt

తారక్ 'గాడ్ ఆఫ్ వార్' పై క్రేజీ టాక్!

Telugu Bell 6 days ago

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మరింత బలమైన లైనప్ ని తారక్ సిద్ధం చేస్తున్నాడు.

అయితే ఈ లైనప్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో భారీ సినిమా ‘గాడ్ ఆఫ్ వార్’ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ గ్యాప్ లో తారక్ పుట్టినరోజుకి నీల్ సినిమాతో పాటుగా గాడ్ అఫ్ వార్ అప్డేట్ కూడా ఉంటుంది అని ఇది వరకే మేము కన్ఫర్మ్ చేసాము. అయితే లేటెస్ట్ గా దీనికి సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ అయితే తన మార్క్ కాన్సెప్ట్ వీడియోని తారక్ రోల్ పై సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది అనుకున్నట్టు పర్ఫెక్ట్ అవుట్ పుట్ వస్తే గనుక తారక్ పుట్టినరోజు నాడు బ్లాస్ట్ గ్యారెంటీ అట. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

The submit తారక్ 'గాడ్ ఆఫ్ వార్' పై క్రేజీ టాక్! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell