Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Tamannaah: 'బాహుబలి' ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!

Telugu Bell 2 days ago

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ స్టార్ హీరోల సరసన నటిస్తూ సౌత్ ఇండియాలోనే అగ్ర తారగా ఒక వెలుగు వెలిగింది.

అయితే, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌కు కాస్త దూరమై, బాలీవుడ్‌లోనే వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. కెరీర్‌లో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ చేయాల్సిన తమన్నా.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్పెషల్ ఐటెం సాంగ్స్‌కే పరిమితం అవ్వడం ఆమె అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది. ఈ తరుణంలో, తాజాగా తమన్నా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ హిట్‌గా నిలిచిన 'బాహుబలి' (Baahubali) చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

'నేటి పరిస్థితులను బట్టి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాహుబలి కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం అద్భుతమైనదిగా అనిపిస్తోంది. కానీ ఆ సినిమా తీస్తున్న సమయంలో ట్రేడ్ లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. కేవలం ఒక ప్రాంతీయ భాష (Regional Language) కు సంబంధించిన సినిమా కోసం ఆ రోజుల్లోనే రూ. 200 కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేయడం సాధారణమైన విషయం కాదు. అప్పటి మార్కెట్ పరిస్థితులను బట్టి వ్యాపార పరంగా చూస్తే.. అది ఫ్లాప్‌కు దారితీసే అత్యంత ప్రమాదకరమైన మార్గం లాగా అనిపించింది. కానీ ఆ రోజుల్లో రాజమౌళి గారు తన విజన్‌ను నమ్మారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు కాబట్టే, అంతటి అద్భుతమైన గ్లోబల్ విజయాన్ని సాధించింది. లేదంటే చాలా పెద్ద సమస్యలు ఎదురయ్యేవి' అని తమన్నా జక్కన్న విజన్‌ను కొనియాడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell