Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Thaman: పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్‌కు 'OG 2' ఆల్బమ్ అంకితం

Thaman: పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్‌కు 'OG 2' ఆల్బమ్ అంకితం

Telugu Bell 2 weeks ago

Thaman: సినిమాలకు ఊరమాస్ మ్యూజిక్ అందిస్తూ, రీసెంట్ టైమ్స్‌లో పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు బ్యాక్‌బోన్‌గా నిలిచిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.

థమన్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. త్వరలోనే రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘OG 2’ మ్యూజిక్ ఆల్బమ్‌ను దివంగత పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్‌కు అంకితం ఇస్తున్నట్లు థమన్ అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా పెద్ద పెద్ద సినిమాల ఆల్బమ్స్ లేదా పాటలను అగ్ర నటులకో, దర్శకులకో లేదా పరిశ్రమకు చెందిన ప్రముఖులకో అంకితం ఇవ్వడం మనం చూస్తుంటాం కానీ థమన్ ఒక అడుగు ముందుకు వేసి, పవన్ కల్యాణ్ అంటే ప్రాణమిచ్చే ఒక సామాన్య అభిమానికి ఈ గౌరవాన్ని దక్కించారు.

నిరంజన్ అనే పవన్ కల్యాణ్ హార్డ్‌కోర్ ఫ్యాన్ ఇటీవలే అకాల మరణం చెందారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఆ చిన్నారి దగ్గరకు వెళ్లి అతనితో కాస్త క్వాలిటీ టైం స్పెండ్ చేసి వచ్చారు. పవన్ శ్రేయోభిలాషిని, పవన్ ఆర్మీలో ఒక బలమైన సైనికుడిని కోల్పోవడం పట్ల థమన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేవలం ఒక అభిమానిగానే కాకుండా, తమ జర్నీలో భాగమైన ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినంతగా థమన్ ఎమోషనల్ అయ్యారు. దర్శకుడు సుజీత్ – పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘OG’ సిరీస్‌పై టాలీవుడ్‌లో ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా థమన్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇంతటి భారీ క్రేజ్ ఉన్న ‘#OG2’ ఆల్బమ్‌ను నిరంజన్ జ్ఞాపకార్థం అంకితం ఇవ్వడం ద్వారా, ఆ అభిమాని పేరు పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఒక మైలురాయి లాంటి ప్రాజెక్ట్‌తో ఎప్పటికీ నిలిచిపోనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell