Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ట్విస్ట్ కా బాప్.. డ్రాగన్ ఎలాంటి సినిమానో తేల్చేసిన ప్రశాంత్ నీల్..!

Telugu Bell 4 days ago

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'డ్రాగన్' చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ గ్లింప్స్‌తో ఒక్కసారిగా 'డ్రాగన్' మూవీపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఈ గ్లింప్స్‌ను ఫక్తు నీల్ మార్క్ కంటెంట్‌తో కట్ చేసిన తీరు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. ఇక ఈ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఈ సినిమా గ్లింప్స్ విషయంలో తాము చాలా ఆలోచనలు చేశామని.. అయితే, తన గత చిత్రాల మాదిరిగా హీరో చుట్టూ కథను తిప్పకుండా.. ఈ సారి కథలో హీరో ముందుకు సాగుతుంటాడు.. ఇలాంటి కథను ఎంత డీటెయిలింగ్‌గా చెబితే ప్రేక్షకులకు అంతగా నచ్చుతుందని నీల్ పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా గ్లింప్స్‌లో తాము చూపెట్టిందంతా ఒక సెటప్ అని.. వాస్తవానికి తమ టీమ్ అందరూ కలిసి ఓ గొప్ప దేశభక్తి చిత్రాన్ని రూపొందిస్తున్నామని నీల్ గర్వాంగా చెప్పుకొచ్చాడు.

దీంతో గ్లింప్స్‌లో లేని అంశాన్ని నీల్ చెప్పడంతో ఇప్పుడు అభిమానుల్లో డ్రాగన్ మూవీపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమా కథ అసలు ఎలా సాగనుందా.. ఎన్టీఆర్ నుంచి ఎలాంటి విధ్వంసాన్ని చూపించబోతున్నారా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

The put up ట్విస్ట్ కా బాప్.. డ్రాగన్ ఎలాంటి సినిమానో తేల్చేసిన ప్రశాంత్ నీల్..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell