Dailyhunt

Vichitra : ఆసక్తికరంగా విచిత్ర ఫస్ట్ లుక్

Telugu Bell 1 week ago

సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫైద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాత గా రూపొందించిన 'విచిత్ర' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా దర్శకుడు మరియు నిర్మాత సైఫైద్దీన్ మాలిక్ మాట్లాడుతూ మా విచిత్ర సినీమా చాలా బాగా వచ్చింది..వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వస్తుంది..మీ అందరి సపోర్ట్ కావాలని కోరారు. ప్రముఖ దర్శకులు వి.ఎఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. విచిత్ర సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది..ఇంతకు ముందే ట్రయిలర్ చూసాను చాలా బాగుంది..ధనుంజయ్ రావ్ ఇలపండ లాంటి టెక్నీషియన్ పెట్టుకొని అద్బుతంగా తెరకెక్కించారు.. తప్పకుండా విచిత్ర పెద్ద హిట్ అవుతోంది అన్నారు. నటీనటులు జ్యోతి అపూర్వజ్, రవి , శ్రేయ తివారి, బేబీ శ్రీ హర్షిణి, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, జబర్దస్త్ ఉద్ధండులు అప్పారావు, త్రినాథ్, సత్తిపండు, బాబీ తదితరులు అద్భుతంగానటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell