Dailyhunt

Vijay And Karunanidhi: కరుణానిధితో విజయ్ పాత ఫోటో వైరల్.. ఆర్జీవీ సంచలన ట్వీట్..

Telugu Bell 6 days ago

మిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది, అదే 'దళపతి' విజయ్. తన కొత్త పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) ద్వారా ఆయన సృష్టించిన సంచలనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

దాదాపు 62 ఏళ్లుగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న ద్రావిడ దిగ్గజాలు DMK మరియు AIADMKల ద్వంద్వాధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారు. ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతోంది. ప్రస్తుతం అందరి దృష్టి ఈ సంఖ్యాబలం, పొత్తుల సమీకరణాలపైనే ఉంది.

వైరల్ అవుతున్న ఆ పాత చిత్రం..
ఈ రాజకీయ ప్రకంపనల మధ్య.. విజయ్, దివంగత మాజీ ముఖ్యమంత్రి DMK దిగ్గజం కరుణానిధి కలిసి ఉన్న ఒక పాత ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో కరుణానిధి ఒక కార్యక్రమానికి సంబంధించి రిబ్బన్ కట్ చేస్తున్నారు. ఆయన వెనుక ఒక సాధారణ యువకుడిలా విజయ్ వినయంగా నిలబడి ఉన్నారు.

రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ఈ ఫోటోను ఎక్స్ వేదికగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పంచుకుంటూ.. తనదైన శైలిలో స్పందించారు. 'తన వెనుక నిలబడిన ఆ పిల్లాడు, ఒకరోజు తన పార్టీనే తుడిచిపెట్టేస్తాడని కలైంజ్ఞర్ (కరుణానిధి) కలలో కూడా ఊహించి ఉండరు' అంటూ ఆర్జీవీ రాసుకొచ్చారు.

కరుణానిధి మరణానంతరం ఆయన కుమారుడు ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలో కొనసాగుతున్న DMKకు విజయ్ రూపంలో ఊహించని దెబ్బ తగలడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకానికి ఆరంభమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell