Dailyhunt

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సరసన కృతిసనన్..

Telugu Bell 2 days ago

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే 'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యువ్‌ దర్శకత్వంలో విజయ్ ఒక మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

వైరా ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్..

కృతీసనన్‌ను చిత్ర బృందం సంప్రదిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ కాంబినేషన్‌కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కృతీసనన్ గతంలో మహేశ్‌బాబు 'వన్‌ : నేనొక్కడినే', ప్రభాస్‌ 'ఆది పురుష్‌', నాగచైతన్య 'దోచెయ్‌' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ ఒక్క మూవీ కూడా హిట్ అవ్వలేదు. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఓకే అయితే, విజయ్ దేవరకొండ – కృతీసనన్ జోడీ వెండితెరపై ఒక ఫ్రెష్ ఫీల్‌ను తీసుకురావడం ఖాయం. కాగా ప్రస్తుతం విజయ్ 'రణబాలి', 'రౌడీ జనార్ధన' సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న తర్వాత శౌర్యువ్‌ దర్శకత్వంలో రాబోయే మైథలాజికల్ సినిమాను విజయ్ ఆరంభించే అవకాశం ఉంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell