Dailyhunt

Vijay TVK: విజయ్ డూప్'తో సీఎంను ఓడించిన బాబు

Telugu Bell 1 week ago

మిళ స్టార్ హీరో విజయ్ ఊహించని విధంగా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పారు. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రిగా ఇప్పుడు తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఆయన హాట్ టాపిక్ అయ్యారు.

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విజయ్ సుమారు 200 నియోజకవర్గాలు ఉంటే అందులో కేవలం 40 లోపే నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఒక రకంగా మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సీఎం స్టాలిన్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థిగా నిలబడిన వి.ఎస్. బాబు ఒక రకంగా వింతైన ప్రచారమే చేశారు. విజయ్ లాగా ఉండే విజయ్ డూప్‌ని రంగంలోకి దించి, విజయ్ ప్రచారానికి వచ్చినట్లుగా ప్రచారం చేయించారు. ఈ క్రమంలోనే స్టాలిన్‌ను సొంత నియోజకవర్గంలోనే ఓడించి బాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ విజయ్ డూప్స్‌కి రోజుకు పదివేల చొప్పున ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎల్ఈడి ప్రొజెక్షన్ ద్వారా విజయ్ అక్కడే నిలబడి మాట్లాడుతున్న ఫీలింగ్ కలిగించే టెక్నాలజీని వాడుకున్నారు. ఇక స్టాలిన్‌ను ఓడించిన వి.ఎస్. బాబు విషయానికి వస్తే, ఆయన వయసు 75 సంవత్సరాలు. గతంలో అన్నాడీఎంకే సహా డీఎంకేలో కూడా ఆయన రాజకీయం చేశారు. ఉత్తర చెన్నై అసెంబ్లీ నుంచి డీఎంకే ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. అలా డీఎంకే నుంచి వచ్చి, ప్రస్తుతం డీఎంకే చీఫ్‌గా ఉన్న స్టాలిన్‌నే ఓడించి ఆయన తమిళనాడు వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell