Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విషాదం: నిరంజన్ మరణం పట్ల పవన్ భావోద్వేగం.. పోస్ట్ వైరల్

విషాదం: నిరంజన్ మరణం పట్ల పవన్ భావోద్వేగం.. పోస్ట్ వైరల్

Telugu Bell 2 weeks ago

టాలీవుడ్ పవర్ స్టార్ట్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణలో తన చిన్నారి అభిమాని నిరంజన్ ని కలిసేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

17 ఏళ్ల కుర్రాడు ఒక అరుదైన వ్యాధితో బాధ పడుతుండగా తన ఆఖరి కోరిక పవన్ కళ్యాణ్ ని చూడాలని ఉందని చెప్పడంతో అది తెలిసిన పవన్ వెళ్లి నిరంజన్ ని కలిసి కొద్ది సేపు కుటుంబంతో కలిసి గడిపారు.

దీనితో ఈ ఫోటోలు పవన్ తో నిరంజన్ సంభాషణ ఎంతో ఎమోషనల్ గా సాగాయి. పవన్ నిరంజన్ ని నువ్వే నా ఓజి 2 కి గెస్ట్ వి అంటూ కూడా చెప్పడం ఇతర అభిమానుల్లో ఎంతో కదిలించాయి. కానీ ఊహించని విధంగా ఈ ఉదయమే నిరంజన్ ఇక లేడు అనే విషాద వార్త సోషల్ మీడియాలో షాకింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో నిరంజన్ మృతి పట్ల పవన్ చింతిస్తూ చేసిన భావోద్వేగపూరిత పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.

“నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.

అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.

నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.” అని పవన్ నిరంజన్ తో గడిపిన కొన్ని మధుర క్షణాలని పోస్ట్ చేసి విచారం వ్యక్తం చేశారు.

నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.

కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ… pic.twitter.com/uQ7ujh3La1

— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2026

The submit విషాదం: నిరంజన్ మరణం పట్ల పవన్ భావోద్వేగం.. పోస్ట్ వైరల్ first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell