Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Vishwambhara : విశ్వంభర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్

Telugu Bell 2 weeks ago

ల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'విశ్వంభర'. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా విఎఫెక్స్ కారణంగా సంవత్సరాల తరబడి వాయిదా పడుతూ వస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు ఇప్పటివరకు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యతను మరో సంగీత దర్శకుడు హరి గౌరకు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో పాటలకు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందించగా నేపథ్య సంగీతం విషయంలో మరింత కొత్తదనం కోసం ఆ బాధ్యతను హరి గౌరకు అప్పగించింది. ఇప్పటికే హరి గౌర ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించిన ఆర్‌.ఆర్ పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం సంగీత దర్శకుడు హరి గౌర ఇప్పటికే ‘హనుమాన్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించి అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే ‘మిరాయ్’ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘విశ్వంభర’ వంటి సోషియో ఫాంటసీ చిత్రానికి తనదైన శైలిలో పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తారని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. వాస్తవంగా సోషియో ఫాంటసీ సినిమాలకు సంగీతం అందించడంలో కీరవాణికి మంచి అనుభవం ఉంది. కానీ విశ్వంభర మేకర్స్ గౌరహరిని రంగంలోకి దింపుతున్నారు. అయితే రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మ్యూజిక్ పనుల్లో కీరవాణి బిజిగా ఉండడం వలన విశ్వంభర బాక్గ్రౌండ్ కోసం గౌర హరిని తీసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell