Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Telugu Bell 3 months ago

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సినిమా VFX వర్క్స్ కారణంగా కొంత డిలే అవుతూ వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే, 'గేమ్ చేంజర్' సినిమాతో సమానంగా-అంటే కొంచెం అటు ఇటుగా రిలీజ్ కావాల్సి ఉన్న సినిమా ఇది.

VFX వర్క్స్ పర్ఫెక్ట్ అయ్యాకే రిలీజ్ డేట్ ప్రకటిద్దామని ఇప్పటివరకు ఆగుతూ వచ్చారు.

వశిష్ఠ దర్శకత్వంలో సోషల్ ఫాంటసీ మూవీగా రూపొందిన ఈ సినిమా మీద టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి ఉంది. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి క్రేజ్, ఆయన గతంలో చేసిన ఇలాంటి సినిమాల అనుభవాల నేపథ్యంలో, ఈ సినిమా ఎలా ఉంటుంది అని ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాని ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాని వశిష్ఠ డైరెక్ట్ చేయగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రభాస్ సన్నిహితులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మొత్తానికి చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న సినిమా, ఎట్టకేలకు ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రానున్నదన్న మాట!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell