Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
11 రోజులు.. 11 విశ్లేషణలు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం చెప్పబోతున్నారు?

11 రోజులు.. 11 విశ్లేషణలు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం చెప్పబోతున్నారు?

తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ రానున్న రోజుల్లో వరుస రాజకీయ విశ్లేషణలు చేయనున్నట్లు సమాచారం వెలువడుతోంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో చోటుచేసుకున్న వివాదాస్పద అంశాలు, పాలనా నిర్ణయాలు, కుటుంబ రాజకీయాలు, పరిశ్రమలు, ప్రాజెక్టులపై ఆయన 11 రోజుల పాటు 11 కీలక విశ్లేషణలు ఇవ్వనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలిసిన వివరాల ప్రకారం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, వైఎస్ కుటుంబ పాత్ర, గత ఏడేళ్ల పరిణామాలు ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. అలాగే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అప్పటి సీఎం జగన్ వ్యవహరించిన తీరుపైనా విశ్లేషణ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై తీసుకున్న నిర్ణయాలు, విశాఖలో భూ కబ్జాల ఆరోపణలు, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై కూడా ఆయన మాట్లాడనున్నారని సమాచారం.

ఇదే కాకుండా పరిశ్రమల తరలింపు, పారిశ్రామిక వేత్తలపై ఒత్తిళ్లు, జగన్ కుటుంబ ఆస్తుల వివాదాలు, తల్లి, చెల్లితో న్యాయపోరాటం, సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు, కల్తీ మద్యం, ఆలయాలపై దాడులు, పూర్తి కాకుండానే ప్రారంభించిన ప్రాజెక్టుల అంశాలు కూడా ఈ విశ్లేషణల్లో ఉండనున్నాయని తెలుస్తోంది.

ప్రతి అంశానికి సంబంధించి రాజకీయ పరిణామాలు, వివాదాలు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను విశ్లేషిస్తూ ఈ కార్యక్రమం ఉండబోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. "యుద్ధం మొదలైంది… ఏపీ ప్రజలారా సిద్ధంగా ఉండండి" అనే వ్యాఖ్య కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin