మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేకులు పడ్డాయి. కరోనా కారణంగా ఆచార్య షూటింగ్ నిలిచిపోవడం ఇది రెండోసారి. మే 14కి విడుదల అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు.
సాధారణంగా కొరటాల శివ తన సినిమాల ఫైనాన్స్ ల విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. తనకు ఒక డిస్ట్రిబ్యూషన్ టీమ్ లాంటిది ఉంది. తను చెప్పిన రేట్లకు తను చెప్పిన వాళ్లకు తన సినిమాల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది.
భరత్ అనే నేను చిత్రం విషయంలో దానయ్యకు, కొరటాలకు మధ్య చిన్నపాటి తేడా వచ్చిందని అంటుంటారు.

