Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసియా క్రీడలకు ఎంపికైన జ్యోతి సురేఖకు మంత్రి లోకేష్ అభినందనలు

ఆసియా క్రీడలకు ఎంపికైన జ్యోతి సురేఖకు మంత్రి లోకేష్ అభినందనలు

అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ దేశానికి గుర్తింపు తీసుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ Vennam Jyothi Surekha ఈ ఉదయం ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ను మర్యాదపూర్వకంగా కలిశారు.

2026 ఆసియా క్రీడలకు భారత జట్టులో ఆమె ఎంపిక కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నివాసానికి వెళ్లిన జ్యోతి సురేఖను మంత్రి లోకేష్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకోవడం గొప్ప విషయమని కొనియాడారు.

తన ప్రతిభతో విలువిద్య క్రీడల్లో సత్తా చాటుతూ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారని మంత్రి ప్రశంసించారు. రాబోయే ఆసియా క్రీడల్లో కూడా అద్భుత ప్రదర్శన చేసి దేశ కీర్తిప్రతిష్టలు మరింత పెంచాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి Anagani Satya Prasad కూడా పాల్గొన్నారు. జ్యోతి సురేఖ సాధిస్తున్న విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin