Dailyhunt
Allu Arjun: అల్లు అర్జున్.. ఇప్పుడు పేరు కాదు.. అదొక 'బ్రాండ్'

Allu Arjun: అల్లు అర్జున్.. ఇప్పుడు పేరు కాదు.. అదొక 'బ్రాండ్'

TeluguBulletin.com 3 weeks ago

Allu Arjun: సినీ పరిశ్రమలో హీరోల వారసులు చాలామందే ఉన్నారు. హీరోల కుమారులు కాకుండా పరిశ్రమలో నిర్మాత, దర్శకుల వారసులకూ కొదవలేదు. అటువంటి హీరోల్లో ఒకరు అల్లు అర్జున్.

అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు. ఘనమైన వారసత్వంతో 22ఏళ్ల క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ నేడు స్టార్ హీరో. తెలుగు, దక్షిణాది కాదు ఏకంగా జాతీయస్థాయిలో. గంగోత్రితో మొదలైన ఆయన ప్రస్థానం పుష్ప సిరీస్ సినిమాలతో ఖ్యాతి జాతీయస్థాయిలోకి వెళ్లింది. ఎందరో అభిమానుల్ని తెచ్చిపెట్టింది. తనకంటూ ఓ మేనరిజమ్ తో అలరిస్తూ డ్యాన్సింగ్ సెన్సేషన్ గా మైమరిపిస్తున్నారు. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పీక్ స్టార్ డమ్ చూస్తున్నారు. అల వైకుంఠపురములో, పుష్ప, పుష్ప-2 సినిమాలతో వరుస సక్సెస్ లు ఆయన సొంతమయ్యాయి. అభిమానులు పెరిగారు. సక్సెస్ రేషియో పెరిగింది. సినిమా బిజినెస్, స్పాన్ పెరిగాయి. ఇప్పుడు అల్లు అర్జున్ నుంచి సినిమా వస్తోందంటే అందులో ఏదో స్పెషల్ ఉంటుందనే నమ్మకం. పుష్పకు మించిన కంటెంట్ ఏదో సినిమాలో ఉండబోతోందనే ఆశలో క్రియేట్ చేశారు. తన డ్యాన్సులతో కేరళంలో అభిమానుల్ని సంపాదించుకున్న అల్లు అర్జున్ మల్లు అర్జున్ గా అక్కడ పిలుచుకునేంత పాపులారిటీ సాధించారు. ఇప్పుడు పుష్పరాజ్ గా దేశమంతా గుర్తించే స్థాయికి అభిమానుల్ని సంపాదించుకునే స్థాయికి చేరుకున్నారు. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు తన సినిమాలతో.

గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పుడు మెగస్టార్ చిరంజీవి మేనల్లుడిగా రంగప్రవేశం చేసి నేడు ఐకాన్ స్టార్ హోదా దక్కించుకోవడం విశేషం. తనకంటూ ఓ దారి వేసుకుని టాలీవుడ్ స్టార్ హీరోల రేసులో నిలిచారు. తెలుగులో మొదటి సిక్స్ ప్యాక్డ్ హీరోగా నిలిచారు. కొత్త తరంలో వెర్సటైల్ డ్యాన్సులకు ఆయన పేరు. మొదటగా స్టయిలిష్ స్టార్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుని ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఎదిగారు. సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే ఆయన ఎన్నో చారిటీలను చేస్తున్నారు. తన అభిమానలతోనూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆయన దృష్టంతా అట్లీ దర్శకత్వంలో వచ్చే సినిమాపై ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న సినిమా 'రాకా'పై భారీ అంచనాలు ఉన్నాయి. కెరీర్లో మరిన్ని సక్సెస్ చూడాలని మనసారా కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది 'తెలుగు బులెటిన్'.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin