Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అత్తాపూర్‌లో అర్ధరాత్రి కిడ్నాప్ .. థార్ కారును ఛేజ్ చేసిన పోలీసులు

అత్తాపూర్‌లో అర్ధరాత్రి కిడ్నాప్ .. థార్ కారును ఛేజ్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌లోని Attapur ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా థార్ కారులో ఎక్కించుకొని తీసుకెళ్లినట్టు సమాచారం.

ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సమాచారం ప్రకారం, యువతి వారి నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని జాయ్ ఆసుపత్రిలోకి పరుగెత్తినట్టు తెలుస్తోంది. అయితే వెంటాడిన యువకులు ఆమెను బెదిరించి మళ్లీ కారులోకి ఎక్కించుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్తాపూర్ నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు థార్ కారును పోలీసులు ఛేజ్ చేసినట్టు తెలిసింది. అయితే కిడ్నాపర్లు పోలీసుల కళ్లుగప్పి పరారైనట్టు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు రాత్రంతా దర్యాప్తు కొనసాగించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ కారు కదలికలను ట్రాక్ చేసే ప్రయత్నం చేశారు. థార్ కారుకు వెనకాల మరో బైక్ కూడా ఫాలో అయినట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

యువతి ఎవరు? కిడ్నాప్‌కు కారణాలేమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin