Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బుల్లితెరపైనా ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన ఎన్టీఆర్

బుల్లితెరపైనా ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన ఎన్టీఆర్

TeluguBulletin.com 5 years ago

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై దర్శనమివ్వనున్న విషయం తెల్సిందే. బిగ్ బాస్ సీజన్ 1 ను హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు షో ను హోస్ట్ చేస్తున్నాడు.

వ్యూయర్ షిప్ పరంగా జెమినీ టివి, స్టార్ మా తో పోల్చుకుంటే బాగా వెనకబడింది. అయితే ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షో తో ఎన్టీఆర్ మరోసారి తన సత్తా చాటాడు. జెమినీ టివిను తిరిగి రేసులో నిలబెట్టాడు.

ఈ రియాలిటీ షో మొదటి వారానికి యావరేజ్ గా 6.76 రేటింగ్ ను సొంతం చేసుకోగా, రెండో వారం స్టడీగా 6.48 రేటింగ్ ను సాధించింది. ఇక మూడో వారం ఎన్టీఆర్ సూపర్బ్ గా హోల్డ్ చేసాడు. ఈ వారం షో 7.3 యావరేజ్ రేటింగ్ ను సాధించింది.

కేవలం వర్కింగ్ డేస్ లో మాత్రమే వచ్చే ఈ షోను వారం వారం రేటింగ్స్ పెంచుతూ ఎన్టీఆర్ బుల్లితెరపైనా కింగ్ అనిపించుకుంటున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin