Dailyhunt
చైతన్య ఓటిటి డెబ్యూ ఎప్పుడంటే!

చైతన్య ఓటిటి డెబ్యూ ఎప్పుడంటే!

TeluguBulletin.com 4 years ago

అక్కినేని నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితం కారణంగా ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో ఉంటూ వస్తున్నాడు. అంతే కాకుండా చైతన్య నటించిన లవ్ స్టోరీ సెప్టెంబర్ 24న విడుదల కాబోతోంది.

ఈ ఏడాది చైతన్య హిందీ డెబ్యూ కూడా చేసాడు. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటించాడు చైతన్య.

ఇక ఇప్పుడు తన ఓటిటి డెబ్యూకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ కోసం ఒక సిరీస్ చేయబోతున్నాడు. అవుట్ అండ్ అవుట్ హారర్ సిరీస్ గా రూపొందనున్న దీని రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి మొదలవుతుంది.

నాగ చైతన్య హారర్ సిరీస్ చేయడం మొదటిసారి కావడంతో చైతన్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా రూపొందుతోన్న బంగార్రాజులో కీలక పాత్ర పోషిస్తున్నాడు చైతన్య.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin