Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిన్న వయసులోనే యూట్యూబ్‌లోకి నారా దేవాన్ష్.. 'Dino Deets' ప్రారంభం

చిన్న వయసులోనే యూట్యూబ్‌లోకి నారా దేవాన్ష్.. 'Dino Deets' ప్రారంభం

మంత్రి Nara Lokesh తనయుడు Nara Devaansh చిన్న వయసులోనే యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 'Dino Deets' పేరుతో దేవాన్ష్ ప్రారంభించిన కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

డైనోసార్లు, శిలాజాలు, పురాతన జీవుల గురించి వినూత్నంగా, పిల్లలకు అర్థమయ్యే సరళమైన శైలిలో ఈ ఛానల్ రూపొందించబడింది.

'Dino Deets' టీజర్‌లో మంత్రి Nara Lokesh కూడా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దేవాన్ష్ తన పాడ్‌కాస్ట్‌ల ద్వారా డైనోసార్ల విశేషాలు, ఫాసిల్స్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు, పురాతన ప్రపంచానికి సంబంధించిన ఎన్నో అరుదైన వివరాలను సరదాగా చెప్పబోతున్నట్లు టీజర్‌లో వెల్లడైంది. చిన్నారులకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించే ప్రయత్నంగా ఈ ఛానల్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా నారా-నందమూరి కుటుంబ సభ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తన కుమారుడు సృష్టిస్తున్న ప్రాచీన ప్రపంచాన్ని ఒక ప్రేక్షకుడిలా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఇప్పటికే చదరంగంలో తన ప్రతిభను నిరూపించుకున్న దేవాన్ష్ గతేడాది 'ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్'గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. '5334 Problems and Games' పుస్తకంలోని 175 క్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను వేగంగా పరిష్కరించి ఈ ఘనత సాధించాడు.

యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికల ద్వారా కూడా 'Dino Deets' ప్రేక్షకులను చేరుకోనుంది. చిన్న వయసులోనే ప్రత్యేకమైన అంశాన్ని ఎంచుకుని ముందుకొచ్చిన దేవాన్ష్ ప్రయత్నంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin