Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chiranjeevi Birthday Special: తుపాను వచ్చినా ఆగని కలెక్షన్ల తుపాన్.. 'జగదేకవీరుడు అతిలోక సుందరి'

Chiranjeevi Birthday Special: తుపాను వచ్చినా ఆగని కలెక్షన్ల తుపాన్.. 'జగదేకవీరుడు అతిలోక సుందరి'

Chiranjeevi Birthday Special: తెలుగు చిత్రసీమలో ఎన్నో సక్సెస్ సినిమాల టైటిల్స్ తర్వాత జనరేషన్లో మళ్లీ తమ సినిమాలకు మేకర్స్ పెట్టుగలిగారు కానీ..

ఒక్క సినిమా టైటిల్ మాత్రం మళ్లీ పెట్టుకోలేకపోయారు. ఆ టైటిల్ కు సరిపోయే అంతటి స్టామినా ఉన్న కథ రాలేదంటే కూడా అతిశయోక్తి కాదు. ఆ సినిమా.. ఆ టైటిల్.. 'జగదేకవీరుడు అతిలోక సుందరి'. మెగాస్టార్ చిరంజీవి-బ్యూటీ క్వీన్ శ్రీదేవి కెరీర్లోనే కాదు. తెలుగు చిత్రసీమ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. మైథలాజిలకల్ సినిమాల్లో కొత్త ఒరవడి సృష్టించిన సినిమాగా.. నాటి జనరేషన్లో ఓ కళాత్మక సినిమాగా వెండితెర వెలుగుగా నిలిచిందీ సినిమా.

సినిమా చూసి ఓ అభిమాని డైరక్టర్ రాఘవేంద్రరావుకు ఇచ్చిన కాంప్లిమెంట్.. 'ఈ సినిమా చిరంజీవి కోసం ఓసారి, శ్రీదేవి కోసం ఇంకోసారి.. సినిమా కోసం మరోసారి చూడాలి' అని. అంతటి వెండితెర అద్భుతకావ్యంగా నిలిచిపోయింది. టైటిల్ కు తగ్గట్టే సినిమాలో చిరంజీవి ఆహార్యం జగదేకవీరుడిలా.. శ్రీదేవి భువి నుంచి దిగివచ్చిన అతిలోకసుందరిలానే అనిపించే భారీ కాన్వాస్ ఉన్న కథ. స్క్రీన్ ప్లే, ఆర్ట్, క్యాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ.. అన్ని విభాగాల్లోనూ ఈ సినిమా ఓ వండర్. వెన్నెల్లో, చల్లగాలిలో ఆరుబయట నిద్రిస్తూ ఆకాశంలో చందమామను చూస్తున్నంత ఫీల్ ఈ సినిమా సొంతం.

పిల్లల సెంటిమెంట్, దైవత్వం, యాక్షన్ మేళవింపుతో సినిమాను అద్బుతంగా మలిచారు రాఘవేంద్రరావు. ఖర్చుకు వెనుకాడకుండా అశ్వనీదత్ నిర్మిస్తే విన్సెంట్ సినిమాటోగ్రఫీ, ఇళయరాజా సంగీతం, చలం ఆర్ట్ వర్క్ సినిమాకు ప్రాణం. పాటల్లో చిరంజీవి-శ్రీదేవి అందం గురించి చెప్పాలంటే ఎన్నేళ్లైనా మరచిపోలేని ఓ అందం. తుపాన్ మధ్య రిలీజైనా భారీ వర్షాలను లెక్క చేయకుండా ప్రేక్షకులు సినిమాను ఆదరించిన తీరు భవిష్యత్తులో మరే సినిమాకు దక్కడం కలే. తుపానా.. చిరంజీవి సినిమానా అంటే చిరంజీవి సినిమానే అనేట్టు చేసిన మూవీ వండర్ 'జగదేకవీరుడు అతిలోక సుందరి'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin