Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chiranjeevi: చిరంజీవిపై చెడు ప్రచారం..! విమర్శకులకు వి.ఎన్.ఆదిత్య క్లాస్

Chiranjeevi: చిరంజీవిపై చెడు ప్రచారం..! విమర్శకులకు వి.ఎన్.ఆదిత్య క్లాస్

TeluguBulletin.com 2 weeks ago

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని యాంటీ ఫ్యానిజంతో పదేపదే తూలనాడతారు కొందరు యాంటీ ఫ్యాన్స్. నీకు నచ్చిన హీరోని అభిమానించుకునే క్రమంలో చిరంజీవిని దూషించడం అవివేకం.

పరిస్థితుల ప్రభావంతో హీరో ఉదయ్ కిరణ్ ఈలోకం నుంచి దూరమైన విషయం తెలిసిందే. కానీ, దానికి కారణమూ చిరంజీవినే చూపిస్తూ కొందరు యాంటీ ఫ్యాన్స్ పైశాచికత్వం చూపిస్తున్నారు. ఉదయ్ కిరణ్ జయంతి, వర్ధంతి రోజుల్లో చిరంజీవినే టార్గెట్ గా చూపిస్తూ సోషల్ మీడియాలో దారుణంగా విషప్రచారం చేస్తున్నారు. ఈ అబద్దపు ప్రచారానికి చిరంజీవి బలవుతున్నారు. దీనిని తీవ్రంగా ఖండించారు ప్రముఖ దర్శకులు వి.ఎన్.ఆదిత్య.

ఇటువంటివారిపై ఆదిత్య ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. 'అనేక అవకాశాలున్న ఇటువంటి వాతావరణంలో ఉదయ్ కిరణ్ కు సూసైడ్ థాట్స్ రాకూడదు. సరే, జరిగిపోయింది. కానీ, ఉదయ్ కిరణ్ ను చిరంజీవే తొక్కేశారు.. అంటూ ఆయనపై విష ప్రచారం చేయడం సరికాదు. చిరంజీవి ఇమేజ్, క్రేజ్ ముందు ఉదయ్ కిరణ్ ఎంత. ఉదయ్ పై చిరంజీవికి ఏం కక్ష ఉంటుంది. ఉదయ్ ను చిరంజీవి తొక్కేస్తే ఏమొస్తుంది. మరి, రవితేజ, నాని, నితిన్, వరుణ్.. ఇలా ఎంతమందో స్వయంశక్తితో ఇండస్ట్రీకి వచ్చి హీరోలయ్యారు. వీరందరినీ కూడా చిరంజీవి తొక్కేయాలిగా. ఆయన కొడుకు గురించి ఆలోచిస్తారు కానీ, ఎవరినో ఆపేయాలని చిరంజీవి ఎందుకు చూస్తారు. ఒకరు ఆపితే ఆగిపోయేది కాదు టాలెంట్' అని కుండబద్దలు కొట్టారు ఆదిత్య.

స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి ఇండస్ట్రికి ఎందరో రావాలని ప్రోత్సహిస్తూంటారు. అటువంటి చిరంజీవి ఓ వ్యక్తిని ఎదగనివ్వరా..? ఆపుతారా..? దీనినే ఆదిత్య చెప్పుకొచ్చారు. పరిశ్రమలోని వ్యక్తిగా, దర్శకుడిగా ఆదిత్యకు అపార అనుభవం ఉంది. ఉదయ్ కిరణ్ తో సిల్వర్ జూబ్లీ సినిమా తీసారు. ఉదయ్ ను దగ్గరగా చూసిన వ్యక్తికి అతని గురించి తెలీకుండా ఉంటుందా..? పరిశ్రమలో ఉంటూ చిరంజీవి వ్యక్తిత్వం గురించి తెలీకుండా ఉంటుందా..? ఇద్దరినీ దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆదిత్య చక్కగా మాట్లాడారు. ఆదిత్యకు తెలిసినంతగా యాంటీ ఫ్యాన్స్ కు చిరంజీవి గురించి తెలిసేది ఏముంటుంది..? కేవలం చిరంజీవిపై ద్వేషం తప్ప.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin