ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెన్నైలో జరిగిన డీఎండీకే నేత, రాజ్యసభ సభ్యుడు ఎల్.కే. సుధీష్ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు.
ఎల్.కే. సుధీష్, ఎల్కేఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణ జ్యోతి సుధీష్ దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్ సందర్భంగా నూతన దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

చెన్నైలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ వధూవరులు డాక్టర్ జన్ను శ్రీ సుధీష్, అఖిల్ రవికుమార్లకు పుష్పగుచ్ఛం అందించి వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. నూతన దంపతులను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకకు రాజకీయ, వ్యాపార, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

