Dailyhunt
డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ "కిల్లర్" గ్లింప్స్ రిలీజ్

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ "కిల్లర్" గ్లింప్స్ రిలీజ్

TeluguBulletin.com 11 months ago

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న కిల్లర్ మూవీ గ్లింప్స్ తాజాగా రిలీజ్ చేశారు. "శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" లాంటి వైవిధ్యభరితమైన సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ పూర్వాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

"కిల్లర్" సినిమాలో జ్యోతీ పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, చందూ, గౌతమ్, దశరథ కీలక పాత్రల్లో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఏయు అండ్ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. వీరి కాంబోలో ఇప్పటికే ఓ సినిమా వచ్చింది. ఇక కిల్లర్ గ్లింప్స్ ను తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేశారు.

గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇందులో హీరోయిన్ పూర్తి యాక్షన్ మోడ్ పాత్రలో నటిస్తుంది. ఆమె కోలుకుంటే మరో జన్మ ఎత్తినట్టే.. ఆమెను ఎదుర్కోవడం కష్టమే అన్న డైలాగ్ తో ఆమె పాత్రకు హైప్ పెంచారు. ఆమె డి బౌండ్ అనే సమస్యతో బాధపడుతున్నట్టు ఇందులో చూపించారు. ఆమెను సూపర్ షీ పాత్రలో చూపించారు దర్శకుడు. జ్యోతి రాయ్ చేసిన స్టన్నింగ్ యాక్షన్, సెటిల్డ్ పపర్మార్మెన్స్ టీజర్ లో ఆకట్టుకుంటోంది. దీన్ని ప్రేమ, రివేంజ్ కథ ఆధారంగా తీస్తున్నారు. ఇక చివర్లో హీరో, డైరెక్టర్ పూర్వజ్.. మొదలెడదామా అనే డైలాగ్ తో ఆకట్టుకున్నారు. గ్లింప్స్ లో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీకి ఆశీర్వాద్ , సుమన్ జీవ సంగీతం అందిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin