Dragon: మే20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్ అద్భుత రికార్డులు సాధించింది. మే 19న రాత్రి 11.52గంటలకు విడుదలైన నాలుగు నిముషాలున్న గ్లింప్స్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈక్రమంలో సినిమాలోని ప్రధాన పాత్రలు. కథను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఏకంగా 24గంటల్లో డ్రాగన్ గ్లింప్స్ 64 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది.
భారతీయ సినిమాలో ఏ సినిమా గ్లింప్స్ తీసుకున్నా 'డ్రాగన్'దే రికార్డని తెలిపింది. ఆల్ టైమ్ రికార్డ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సినిమాలో ఎన్టీఆర్ మాస్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. 'పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అలరించింది. డార్క్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాపై ప్రస్తుతం విడుదలైన గ్లింప్స్ అంచనాలు పెంచింది.
లుగర్ అనే పేరుతో ఎన్టీఆర్ కనిపించనున్నారు. కేజీఎఫ్ సిరీస్ లతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. డ్రాగన్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2027 జూన్ 11న ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ పూర్తిగా మార్చుకున్నారు. ఇలాంటి లుక్ కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారని.. ఓధశలో ఆపేయమన్నా వినకుండా పూర్తి లుక్ వచ్చేవరకూ శ్రమించారని దర్శకుడు నీల్ అన్నారు.

