Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
E20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు.. అసలు వివాదమేంటి?

E20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు.. అసలు వివాదమేంటి?

భారత్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్‌తో కూడిన ఈ20 (E20) ఇంధనాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి ముందుగానే దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చింది.

అయితే ఈ నిర్ణయంపై పలు ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జులై 5న నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, సోషల్ మీడియాలో కూడా ఈ20 ఇంధనంపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.

ఈ20 పెట్రోల్ వల్ల పాత మోడల్ వాహనాల ఇంజిన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని, మైలేజ్ తగ్గవచ్చని పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంధనం అన్ని వాహనాలకు పూర్తిగా అనుకూలమా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా పాత వాహనాలను ఉపయోగిస్తున్న వారికి అదనపు భారం పడే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబానికి చెందిన ఇథనాల్ వ్యాపారాలపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విధానానికి సంబంధించి ప్రయోజనాల సంఘర్షణ (Conflict of Interest) ఉందంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.

ఇథనాల్ ఉత్పత్తికి అధిక స్థాయిలో నీటి వినియోగం అవసరమవుతుందని, ఇది పర్యావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు, కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వినియోగదారులకు ఈ0 (E0), ఈ10 (E10) వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులో ఉంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ20 (E20) ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని అమలు చేసే ప్రక్రియను కొంతకాలం వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin