Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Fauji: ప్రభాస్ 'ఫౌజీ' టీమ్ కు ప్రమాదం.. ఒకరు మృతి

Fauji: ప్రభాస్ 'ఫౌజీ' టీమ్ కు ప్రమాదం.. ఒకరు మృతి

TeluguBulletin.com 3 weeks ago

Fauji: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా 'ఫౌజీ'. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ ఏడాదే సినిమాను విడుదల చేసేందుకు టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఫౌజీ టీమ్ కు అనుకోని షాక్ తగిలింది. సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న ప్రొడక్షన్ యూనియన్ సభ్యుల కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో డివైడర్ ను ఢీకొట్టి కారు ప్రమాదానికి గురైంది. యూనిట్ ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందడంతో యూనిట్ కలవరానికి గురైంది. గాయపడినవారి ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది. ప్రేమ, దేశభక్తి, యాక్షన్ కథాంశంతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఫౌజీ మూవీ చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోంది. 1940ల నాటి బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండనుంది. సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఇమాన్వి నటిస్తోంది. టి-సిరీస్, మైత్రీ మూవీస్ సంయుక్తంగా సినిమా నిర్మిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin