Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్‌కు బిగ్ షాక్?.. అప్రూవర్ దిశగా విజయసాయిరెడ్డి అడుగులా!

జగన్‌కు బిగ్ షాక్?.. అప్రూవర్ దిశగా విజయసాయిరెడ్డి అడుగులా!

TeluguBulletin.com 2 weeks ago

వైఎస్ కుటుంబానికి దశాబ్దాల పాటు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ, జగన్ అక్రమాస్తుల కేసుల్లో A-2గా జైలు శిక్ష కూడా అనుభవించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్‌కు ఊహించని షాక్ ఇవ్వబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఇటీవలి పరిణామాలు చూస్తుంటే ఆయన కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ తనకు తగిన గుర్తింపు దక్కలేదనే భావన విజయసాయిరెడ్డిలో బలపడిందని, సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీతో పాటు వైసీపీ సోషల్ మీడియా వర్గాల నుంచి ఎదురైన విమర్శలు కూడా ఆయనను తీవ్ర అసంతృప్తికి గురి చేశాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల విజయసాయిరెడ్డి విడుదల చేసిన లేఖలో "అప్రూవర్" అంశాన్ని ప్రస్తావించడం వెనుక కూడా పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో దర్యాప్తు సంస్థల ముందు అప్రూవర్‌గా మారే అవకాశం ఉన్నప్పటికీ జగన్ పట్ల ఉన్న విధేయతతో ఆ నిర్ణయం తీసుకోలేదని, అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులు ఆయన ఆలోచనల్లో మార్పుకు కారణమయ్యాయని చెబుతున్నారు.

జగన్ ఆర్థిక వ్యవహారాలు, క్విడ్ ప్రో కో పెట్టుబడులు, షెల్ కంపెనీల ఏర్పాటు, నిధుల బదిలీలు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అనేక కీలక అంశాలపై విజయసాయిరెడ్డికి పూర్తి అవగాహన ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ కేసులకు సంబంధించిన కీలక సమాచారం, పత్రాలు, డిజిటల్ ఆధారాలపై కూడా ఆయనకు పూర్తి సమాచారం ఉందని ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉంటే త్వరలోనే విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని, అందుకు ముందే సంచలనాత్మక మీడియా సమావేశం నిర్వహించే అవకాశముందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ సమావేశంలో జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన కీలక విషయాలను బయటపెట్టే అవకాశం ఉందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

ఒకప్పుడు జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయంగా కొత్త దారి ఎంచుకుంటే, అది వైసీపీకి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కీలక పరిణామాలకు దారితీసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin