తెలంగాణలో జనసేన పార్టీ చేరికల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు అధికారికంగా జనసేన పార్టీలో చేరారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి వారికి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర చేరికల కమిటీ సభ్యురాలు తనూజా రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన నర్రా సుఖేందర్ రెడ్డి పార్టీలో చేరగా, రాష్ట్ర నాయకులు రాము యాదవ్, గంగిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఖమ్మంకు చెందిన కలసాని రఘువీర్ యాదవ్, పేరాం మల్లయ్య, మాలేటి రవి జనసేనలో చేరారు.
ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన నాయకులకు పార్టీ నాయకత్వం శుభాకాంక్షలు తెలియజేసి, తెలంగాణలో జనసేనను మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చింది. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నాయకత్వం సూచించింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గడల శ్రీనివాసరావు, చేరికల కమిటీ కన్వీనర్ మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, రాష్ట్ర నాయకులు ఎం. దామోదర్ రెడ్డి, మచ్చ సుధాకర్, మండపాక కావ్య, శ్రీధర్ శర్మతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

