Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jr Ntr: 'మొదలే కాలేదు..' వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: 'మొదలే కాలేదు..' వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

TeluguBulletin.com 3 months ago

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. 'గాడ్ ఆఫ్ వార్'గా పిలుస్తున్న సినిమాకు టైటిల్ ఇదేనంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

ఇటివలే సినిమాకు సంబంధించి ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ అభిమానులతోపాటు ఇండస్ట్రీలోనూ సినిమాపై ఆసక్తి రేకెత్తేలా చేసిన డిజైన్ అందరినీ అబ్బురపరచింది. మైథాలజికల్ సబ్జెక్ట్ గా రానున్న సినిమాపై ఇప్పటినుంచే ఆసక్తి నెలకొంది. ఇంకా మొదలుకాని.. ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలీని ఈ సినిమాపై ఇప్పుడో వివాదం రాజుకుంది.

ఈ సినిమాను తక్షణమే నిలిపివేయాలని తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి (NTK) పార్టీ అధినేత సీమాన్ డిమాండ్ చేశారు. ఇది తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. సినిమాను ఆపకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని సీమాన్ హెచ్చరించారు. ఇంతటి వివాదానికి కారణం 'గాడ్ ఆఫ్ వార్'గా తెరకెక్కనున్న సినిమా కోసం పోస్టర్ విడుదల చేసే క్రమంలో సోషల్ మీడియాలో నిర్మాతలు కల్యాణ్ రామ్, నాగవంశీ చేసిన పోస్ట్. అందులో వారు తెలియజేసిన మేటర్ ఈ వివాదానికి కారణమైంది.

మోషన్ పోస్టర్ పోస్ట్ లో ' సుబ్రహ్మణ్యస్వామి ఉత్తరాదిలో పుట్టాడని నిర్మాతలు ప్రస్తావించడం వివాదానికి కారణమైంది. తమిళుల ఇష్ట దైవమైన మురుగన్‌ను ఉత్తరాంధ్ర దైవంగా చూపించడంపై సీమాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మురుగన్ తమిళనాడుకే చెందిన దైవమనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని అన్నారు. తమిళుల మనోభావాలు కించపరిస్తే ఊరుకునేది లేదని.. సినిమా ఆపకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. సెట్స్ పైకి వెళ్లకముందే వివాదంలో చిక్కకున్న సినిమా.. మొదలైతే ఎటువంటి రచ్చకు దారి తీస్తుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ స్పందనేంటో తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin