Jr.Ntr Birthday Special: జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలో ఉన్న సినిమాల్లో ఆయన నటనకి ఎక్కువ మార్కులు పడుతూంటాయి. కారణం, నటనలో ఇంటెన్సిటీ. కళ్లలో తీక్షణత, డైలాగ్ డెలివరీలో గాంభీర్యం, పాత్రలో లీనమై చేసే నటన..
ఇవన్నీ ఆయన్ను యంగ్ టైగర్ అని అభిమానులు పిలుచుకునేలా చేశాయి. జనతా గ్యారేజ్, అరవింద సమేత వీరరాఘవలోని పాత్రల్లో ఎంతటి మెథడ్ యాక్టింగ్ చూశామో.. టెంపర్ లాంటి సినిమాల్లో అంతటి ఆవేశపూరిత నటనా చూశాం. ఈరెండూ కలబోసిన పాత్ర ఆయనకు 'ఆర్ఆర్ఆర్'లో దక్కింది. కొమరం భీమ్ పాత్రలో ఆయన ఒదిగిన తీరు నిజంగా భీమ్ పాత్ర మన ముందు ఉన్నట్టుగా నటించారు. అమాయకమైన అడవి బిడ్డగా.. ఆపదొస్తే తిరగబడే బెబ్బులిగా నటించారు.
ముఖ్యంగా రామ్ చరణ్ ను పాము కాటు నుంచి కాపాడే సన్నివేశంలో అమాయకత్వం.. ఆవెంటనే ఇంటర్వెల్ సీన్లో జంతువులతో కలిసి దూకే సన్నివేశం, ఫైట్లో వెనువెంటనే మెథడ్ యాక్టింగ్ అండ్ ఫెరోషియస్ యాక్టింగ్ ఆయనలో చూడొచ్చు. నటనలో అంతటి పరిపక్వత ఆయనకు తొలినాళ్ల నుంచే ఉందనేది సుస్పష్టం. ఎన్టీఆర్ నుంచి వచ్చిన మరో ఎమోషనల్ మూవీ దేవర. ఫ్యాన్స్ ను మెప్పించిన సినిమా ఇది. ఎన్టీఆర్ పాత్ర కూడా ఊరికి నాయకుడిగా, అనుచరులకు ధైర్యంగా ఉండే పాత్రలో నటించారు. ఇటువంటి పాత్రల్లో ఎన్టీఆర్ తనలోని అసామాన్యమైన నటన ప్రదర్శించి మెప్పించడం ఆయనకు చాలా చిన్న విషయం.
'ఆర్ఆర్ఆర్' నుంచి వచ్చిన నేషనల్ ఫేమ్ తో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చేసిన సినిమా వార్-2. హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ఈ భారీ మల్టీస్టారర్ ఫలితం పక్కనపెడితే నార్త్ ఆడియన్స్ కు ఎన్టీఆర్ లోని నటనను మరోసారి పరిచయం చేసిందని చెప్పాలి. యాక్షన్ సీన్లలో తన మార్క్ ఎగ్రెసివ్ నటనతో అలరించారు ఎన్టీఆర్. ఇలా తనలోని నటనను సినిమా సినిమాతో పెంచుకుంటూ ఫ్యాన్స్ ను అలరిస్తూ కెరీర్లో ముందుకు సాగుతున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న 'డ్రాగన్' సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. త్వరలో విడుదలవుతున్న సినిమా టీజర్ నేడు విడుదల కానుంది.

