Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jr.Ntr Birthday Special: వరుస హిట్ సినిమాలు.. వైవిధ్యమైన నటన.. 'జూ.ఎన్టీఆర్'

Jr.Ntr Birthday Special: వరుస హిట్ సినిమాలు.. వైవిధ్యమైన నటన.. 'జూ.ఎన్టీఆర్'

Jr.Ntr Birthday Special: హీరోకి మాస్ ఇమేజ్ ఎంత అవసరమో.. ఫ్యామిలీ ఇమేజ్ కూడా అంతే అవసరం. నందమూరి కుటుంబ హీరోలకు సీనియర్ ఎన్టీఆర్ నుంచీ కుటుంబ ప్రేక్షకాదరణ ఎక్కువే.

నందమూరి కుటుంబం నుంచి మూడో తరం హీరోగా వచ్చిన ఎన్టీఆర్ కు కూడా ఫ్యామిలీ ఇమేజ్.. ఫ్యామిలీ ఆడియన్స్ కావాల్సిందే. ఈక్రమంలో చేసి మెప్పించిన సినిమా 'బృందావనం'. విడిపోయిన ఇద్దరు అన్నాదమ్ములను కలిపేందుకు వారి ఊరు వెళ్లి ఆ కుటుంబంలో ఒకడిగా కలిసే పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయారు. తన కెరీర్లో విజయవంతమైన సినిమాగా నిలిపారు. అటుపై మాస్, ఫ్యామిలీ ఇమేజ్ సినిమాలతోనే ఎన్టీఆర్ ప్రయాణం సాగింది.

'టెంపర్'లో తనదైన మాస్ అప్పీల్ తో ఎన్టీఆర్ సినిమాను సింగిల్ హ్యాండెడ్ గా నడిపించారు. అవినీతి పోలిస్ అధికారిగా నటించి మొదట విలనిజం ఛాయలు చూపించి.. మారిపోయిన పోలిస్ గా తన నటలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా కాజల్ ను అబ్జర్వ్ చేసే సన్నివేశంలో జీప్ దగ్గర ఆవేశంగా సింగిల్ ఫ్రేమ్ లో గన్ తిప్పుతూ చేసిన నటన అద్భుతమని చెప్పాలి. ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ఇదొకటి. 'నాన్నకు ప్రేమతో..'లో కూడా ఎన్టీఆర్ విభిన్నమైన పాత్రలో నటించారు. సినిమా చాలా క్లాసీగా ఉన్నా కూడా ఎన్టీఆర్ నుంచి ఫ్యాన్స్ ఆశించే అంశాలన్నీ సినిమాలో ఉంటాయి. తండ్రిపై ప్రేమ చూపించే పాత్రలో ఎన్టీఆర్, సైలెంట్ ఆర్ట్ యాక్టింగ్ లో తన మార్క్ చూపించారు.

'జనతా గ్యారేజ్'లో ప్రకృతి ప్రేమికుడిగా, సమాజ సేవ చేసే యువకుడిగా గ్యారేజ్ భావాల్ని ముందుకునడిపే యువకుడిగా విభిన్న పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ నటించిన విభిన్నమైన సినిమాల్లో జై లవకుశ ఒకటి. త్రిపాత్రాభినయంలో విభిన్న వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో హీరో ఎలివేషన్లకు తగ్గట్టు గానే ఎన్టీఆర్ తనదైన నటన ప్రదర్శించారు. అరవింద సమేత సినిమా ఎన్టీఆర్ కు స్పెషల్. ఇంట్రడక్షన్ ఫైట్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడొచ్చు. సినిమా ఆద్యంతం భావోద్వేగమైన నటనతో ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకుల్ని అలరించారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా కావడంతో ఎన్టీఆర్ కు బలమైన పాత్ర కుదిరి సినిమా సక్సెస్ లో కీలకమైంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, పాత్రలో వైవిధ్యం ఎన్టీఆర్ కు మంచి పేరు తీసుకొచ్చాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin