Jr.Ntr: ప్రతి ఏటా తమ అభిమాన హీరో పుట్టినరోజు అభిమానులకు పండగ. తమ హీరో కొత్త సినిమా కబురు కోసం వెయిట్ చేస్తారు. హీరోకు శుభాకాంక్షలు తెలియజేస్తారు.
నిజానికి ప్రతి హీరో అభిమానుల్లోఈ హంగామా సాధారణమే. కానీ, ప్రత్యేకించి ఆ పుట్టినరోజుకి కొత్త సినిమా కబురు, స్టిల్, కొత్త సినిమా విశేషాలు తెలిస్తే ఇంకా సంతోషిస్తారు. ప్రస్తుతం ఆ హైలోనే ఉన్నారు అభిమానులు. ఆ హీరో 'జూ.ఎన్టీఆర్'. మే 20న వాళ్లకు నిజంగానే పండగ మరి. రెండున్నర దశాబ్దాలకుపైగా అభిమానులను అలరిస్తూ వస్తున్నారు ఎన్టీఆర్. నేడు ఆయన పుట్టినరోజు. ఈసారి తన పుట్టినరోజుకి సరికొత్త హంగామాతో వచ్చారు. డ్రాగన్ గ్లింప్స్ ఇచ్చారు.
వారి అంచనాలకు తగ్గట్టే 'డ్రాగన్' గ్లింప్స్ వదిలారు. అభిమానులు సంతోషంలో ఉన్నారు. మరో అప్డేట్ త్రివిక్రమ్ తో సినిమా అంటున్నారు. అది కూడా వచ్చేస్తే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. మొత్తంగా ఎన్టీఆర్ ఎప్పుడూ ఫ్యాన్స్ ని మెప్పించే విధంగా సినిమాలు చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ సినిమాలు చేసినా.. మాస్ సినిమాలు చేసినా ప్రేక్షకుల్ని అలరించడమే ఆయనకు ముఖ్యం. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ తో దేవర, వార్ 2 సినిమాలు చేసి నార్త్ ప్రేక్షకుల్నీ అలరించారు. ఇప్పుడు డ్రాగన్ తో మరోసారి తన మార్క్ చూపించబోతున్నారు. త్రివిక్రమ్ తో సినిమాలో డివైన్ లుక్ లో అలరించబోతున్నారని టాక్.
ప్రస్తుతం ఎన్టీఆర్ దృష్టంతా సినిమాలపైనే. కానీ, ఆయన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ సెంటర్ పాయింటే. ఈ పొలిటికల్ పాయింట్ లో ఏదో సందర్భంలో ఫ్యాన్స్ హంగామా చేస్తారు కానీ.. ప్రస్తుతానికి ఆయన నుంచి పొలిటికల్ ఇంట్రెస్ట్ శూన్యం. కానీ, ఉన్నత హోదాలో ఎన్టీఆర్ ను చూడాలనేది కూడా ఫ్యాన్స్ కోరికే. వారి ఆకాంక్షలు మేరకు సినిమాలు చేసి సంతృప్తిపరిచే ఎన్టీఆర్.. భవిష్యత్ ప్రయాణం ఎవరికీ తెలీదు. మరి అభిమానుల ఆశలు నెరవేరతాయోలేదో కాలమే సమాధానం చెప్పాలి. మొత్తంగా హీరో ఎన్టీఆర్ తన ప్రయాణంలో మరిన్ని విజయాలు అందుకోవాలని.. సక్సెస్ ఫుల్ హీరోగా తన ప్రయాణాన్ని నిరంతరం కొనసాగించాలని మనసారా కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది.. 'తెలుగు బులెటిన్'

